newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

వైసీపీలోకి జంప్ కానున్న టీడీపీ కాపు నేత‌లు..?

15-09-201915-09-2019 11:14:06 IST
Updated On 15-09-2019 11:25:46 ISTUpdated On 15-09-20192019-09-15T05:44:06.584Z15-09-2019 2019-09-15T05:41:42.261Z - 2019-09-15T05:55:46.681Z - 15-09-2019

వైసీపీలోకి జంప్ కానున్న టీడీపీ కాపు నేత‌లు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు వ‌ర్గ రాజ‌కీయం కాక‌రేపుతోంది. వైసీపీ ఆక‌ర్ష్‌కు ఏపీలో బ‌ల‌మైన వ‌ర్గంగా భావిస్తున్న కాపు నేత‌లు ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ వెన్నంటి ఉన్న నేత‌లు ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నారు. ఆ జాబితాలో రామ‌చంద్రాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మొద‌టి ప్లేస్‌లో నిలిచారు.

వంద రోజుల పాల‌న నేప‌థ్యంలో వైసీపీ ప‌థ‌కాల అమ‌లుపైనే కాకుండా ప్ర‌తిప‌క్షాల ప‌నీప‌డుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూప‌గ‌ల నేత‌గా పేరుపొందిన త్రిమూర్తులును వైసీపీ త‌మవైపుకు లాగేసుకుంది. కాపుల్లో బాగా ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా త్రిమూర్తులుకు పేరుంది.

గ‌త కొంత కాలంగా టీడీపీకి అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న ఆయ‌న అంద‌రూ ఊహించిన‌ట్టుగానే వైసీపీలోకి జంప్ అయ్యేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో అ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసిన త్రిమూర్తులు ఈ నెల 18న సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్నారు.

తోట త్రిమూర్తుల‌తోపాటు మ‌రికొంద‌రు కూడా టీడీపీని వీడ‌తార‌న్న ప్ర‌చారం సాగుతోంది. వారిలో విశాఖ‌ప‌ట్నంకు చెందిన య‌ల‌మంచిలి మాజీ ఎమ్మెల్యే పంచ‌క‌ల్ల ర‌మేష్‌బాబు కూడా త్రిమూర్తులు వెంట వెళ్లే వారిలో ఉన్నార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. బ‌ల‌మైన కాపువ‌ర్గం నేత‌గా, ఈ మ‌ధ్య‌కాలంలో నాలుగైదు సార్లు స‌మావేవం కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఇలా టీడీపీలోని వారంతా ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతూ వ‌స్తున్నారు. అయితే తాము ఏ పార్టీలో చేరుతారోన‌న్న విష‌యాన్ని ముందుగా లీక్ చేయ‌కుండా ఒక్కొక్క‌రుగా సైకిల్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆ త‌రువాత అంద‌రూ క‌లిసి వైసీపీలో చేరాల‌ని చూస్తున్నారు. వైసీపీ కూడా అలాంటి నేత‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతోంది. అయితే కాపు నేత‌ల రాక నేప‌థ్యంలో స్థానికంగా ఉన్న వైసీపీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా చేసుకుంటోంది.

అయితే టీడీపీని వీడ‌నున్నారంటూ కేవ‌లం ఒక్క పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు పేరు మాత్ర‌మే కాదు కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమ‌, క‌నిగిరి నుంచి కదిరి బాబురావుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ కాపు ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది వ‌ర‌కు తోట త్రిమూర్తులుతోనే ప‌య‌న‌మ‌య్యేందుకు రెడీ అవుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle