newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వైసీపీమంత్రి మిస్ 'ఫైర్‌'..!

21-09-201921-09-2019 12:09:38 IST
Updated On 21-09-2019 12:12:17 ISTUpdated On 21-09-20192019-09-21T06:39:38.473Z21-09-2019 2019-09-21T06:39:31.002Z - 2019-09-21T06:42:17.564Z - 21-09-2019

వైసీపీమంత్రి మిస్ 'ఫైర్‌'..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ స్థానాల‌తో ఘ‌న విజ‌యం సాధించి అధికారం చేప‌ట్టిన వైసీపీపై ఆరు నెల‌ల త‌రువాత స్పందిస్తామ‌ని చెప్పిన ప్ర‌తిప‌క్షాలు మాట‌ల యుద్ధాన్ని మొద‌లు పెట్టాయి. సీఎం జ‌గ‌న్ వంద రోజుల పాల‌న రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌లే ల‌క్ష్యంగా సాగిందని టీడీపీ విమ‌ర్శించ‌గా, రాష్ట్రంలో ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న కొన‌సాగుతోంద‌ని జ‌న‌సేన ఆరోపిస్తోంది. మ‌రోప‌క్క, త‌మ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను మంత్రులు ఖండిస్తూ వస్తున్నారు.

ఇలా కృష్ణా జిల్లా క‌ర‌క‌ట్ట‌కు వ‌ర‌ద నీరు నుంచి నిన్న జ‌రిగిన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ అంత్య‌క్రియ‌ల వ‌ర‌కు రాష్ట్ర రాజకీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. చంద్ర‌బాబు నివాసం ఉంటున్న లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్‌కు అన్ని అనుమ‌తులు ఉన్నా జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ఆ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చిత్రీక‌రించాల‌న్న ఆలోచ‌న‌తో కృత్రిమ వ‌ర‌ద‌ల‌ను సృష్టించారంటూ టీడీపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆరోప‌ణ‌ల‌ను వైసీపీ మంత్రులు ఖండిస్తూ వ‌చ్చారు.

ఆ వెను వెంట‌నే ఏపీ ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధానిగా ముంపు ప్రాంత‌మైన‌ అమ‌రావ‌తిని ఎంపిక‌చేసి పెద్ద త‌ప్పుచేసిందంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. అంతేగాక అమ‌రావ‌తి ప్రాంతంలో నిర్మాణాలు సాధార‌ణ ప్రాంతాల‌తో పోలిస్తే నాలుగురెట్లు ఎక్కువ వ్య‌యం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. బొత్స మాట‌ల‌ను ఆధారంగా చేసుకున్న కొంద‌రు ప్ర‌కాశం జిల్లా దొన‌కొండ‌కు రాజ‌ధాని త‌ర‌లింపు అంటూ సోష‌ల్ మీడియాలో క‌థ‌నాల‌ను ప్రచురించారు. బొత్స వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారంటూ ఆ క‌థ‌నాల‌ను వైసీపీ మంత్రులు ఖండిస్తూ వ‌చ్చారు.

ఇక కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు ఆత్మ‌హ‌త్య‌పై రాజకీయ‌వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేపుతోంది. అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ ఎత్తుకెళ్లాడంటూ జ‌గ‌న్ స‌ర్కార్ కోడెల‌పై కేసుపెట్టి చిత్ర హింస‌ల‌కు గురి చేసింద‌ని, ఆ అవ‌మాన భారాన్ని త‌ట్టుకోలేక కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ టీడీపీ చెప్పుకొస్తుండ‌గా, ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో కోడెల‌పై కేసులు న‌మోదు కావ‌డంతో పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని టీడీపీనే ఆయ‌న్ను దూరం పెట్టింద‌ని, న‌మ్ముకున్న పార్టీనే మోసం చేయ‌డంతో కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ వైసీపీ చెప్పుకొస్తోంది. ఇలా ఒక్కో అంశంపై ఏపీ మంత్రులు, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య టంగ్ వార్ కొన‌సాగుతోంది.

అయితే, ఈ మొత్తం వ్యవ‌హారాల్లో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మిస్ అయ్యారు. కేవ‌లం వైసీపీలోనే కాకుండా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌ప‌డిన ఆ మంత్రి వాయిస్ ఇప్పుడు ప్ర‌భుత్వం త‌రుపున ఎక్క‌డా విన‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో హిట్ సినిమాల‌తో దూసుకెళ్తున్న హీరోకు డిజాస్ట‌ర్ ఎదురైన‌ట్టు, సెంచ‌రీల‌తో చెల‌రేగి ఆడే క్రికెట‌ర్ జీరో ర‌న్స్‌కే ఫెవిలియ‌న్‌కు చేరిన‌ట్టు ఆ మంత్రి తీరు ఉందంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆయ‌నే రాష్ట్ర నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్‌.

కాగా, అనీల్ కుమార్ యాద‌వ్ వైసీపీలోని కీల‌క నేత‌ల్లో ఒక‌రు. కార్పొరేట‌ర్‌గా త‌న రాజీక‌య జీవితాన్ని ప్రారంభించి మంత్రి స్థాయికి చేరుకున్నారు. అన‌తి కాలంలోనే రాజ‌కీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న నేత‌ల్లో అనీల్ కుమార్ ఒక‌రు. త‌న దూకుడుతో పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవ‌డమే కాకుండా సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సంద‌ర్భంగా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందారు. అలా సీఎం జ‌గన్‌కు ఆప్తుడిగా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

అంతేకాకుండా వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న ఇత‌ర పార్టీల నేత‌ల‌పై విరుచుకుప‌డ‌టంతో మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్‌ది ప్ర‌త్యేక శైలి. నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయ‌డంలో మంత్రి అనీల్ దిట్ట‌. రాజ‌కీయ అనుభ‌వం, ఆర్థిక‌బ‌లం లేక‌పోయిన‌ప్ప‌టికీ మాజీ మంత్రి నారాయ‌ణలాంటి వ్య‌క్తిపై నెగ్గ‌డంతో ఆయ‌న క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. అంత‌టి పొలిటిక‌ల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న అనీల్ కుమార్ యాద‌వ్  వాయిస్ ఇప్పుడు వినిపించ‌డం లేదు. క‌నీసం రాజ‌కీయ విశ్లేష‌కుల చ‌ర్చ‌ల్లోనూ ఆయ‌న పేరు ప్రస్తావ‌న‌కు రావ‌డం లేదు.

ఇదే అంశంపై సోష‌ల్ మీడియాలో స్పందిస్తున్న ఆయ‌న అభిమానులు మాత్రం యువ‌ర‌క్తం క‌నుక రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం మామూలేన‌ని, కానీ, అనీల్ కుమార్ మాత్రం అందుకు భిన్న‌మ‌ని చెబుతున్నారు. ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే త‌క్కువ స‌మ‌యంలోనే స‌క్సెస్‌ఫుల్ పొలిటీషియ‌న్‌గా పేరుపొందారు. ఎక్క‌డ నెగ్గాలో కాదురా.. ఎక్క‌డ త‌గ్గాలో అన్న అత్తారింటికి దారి సినిమాలోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు వైసీపీ మంత్రిగా అనీల్ కుమార్ యాద‌వ్ త‌న వాయిస్‌ను వినిపించ‌క‌పోవ‌డంపై ప‌లు అనుమానాల‌కు తావివ్వ‌క‌మాన‌దు మ‌రీ..!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle