newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

వైసీపీని బీజేపీ అలా టార్గెట్ చేస్తుందా..?

15-07-201915-07-2019 08:26:42 IST
Updated On 15-07-2019 11:21:20 ISTUpdated On 15-07-20192019-07-15T02:56:42.848Z15-07-2019 2019-07-15T02:49:23.645Z - 2019-07-15T05:51:20.020Z - 15-07-2019

వైసీపీని బీజేపీ అలా టార్గెట్ చేస్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ భ‌విష్య‌త్ వ్యూహాలు ఎలా ఉండ‌బోతున్నాయో ఆ పార్టీ నాయ‌కులు చెప్ప‌క‌నే చెబుతున్నారు. సాధార‌ణంగా బీజేపీ వ్యూహాలు అంత సులువుగా బ‌య‌ట‌ప‌డ‌వు. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌చ్చిన నేత‌లు ఈ వ్యూహాల‌ను సీక్రెట్‌గా అమ‌లు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఏపీ బీజేపీలో వ‌ల‌స నేత‌లే ఎక్కువ కావ‌డంతో వారు ఇట్టే బ‌య‌ట‌ప‌డిపోతున్నారు.

తాజాగా, తెలుగుదేశం పార్టీలో అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగి ఇటీవ‌లే బీజేపీలో చేరిన లంకా దిన‌క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాయి. వాస్త‌వానికి ఈ వ్యాఖ్య‌లు రానున్న రోజుల్లో ఆంధ్రప్ర‌దేశ్‌లో బీజేపీ ఎటువంటి రాజ‌కీయ ఎజెండాతో ముందుకుపోతుందో చెబుతున్నాయి.

దేశం మొత్తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త‌మార్పిడులు పెరిగాయ‌ని, కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో మ‌త‌మార్పిడులు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ఆరోపించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌త‌మార్పిడుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని, ప్ర‌భుత్వాలు ఒక మ‌తానికి కొమ్ముకాయ‌డం మంచిది కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొంద‌రు ఆర్ఎస్ఎస్ నేత‌లే ఈ విష‌యం చెప్పిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇది ఆందోళ‌న‌క‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల వెనుక పెద్ద ఎత్తుగ‌డ‌నే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు మ‌త మార్పిడుల అంశాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిష్టియ‌న్ కావ‌డం, ఆయ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక‌నే మ‌త‌మార్పిడులు పెరిగాయ‌ని ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్ట‌డం ద్వారా ఏపీలో హిందువుల్లో జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక‌త తీసుకువ‌చ్చే వ్యూహం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

దీనికి కౌంట‌ర్ ఇవ్వ‌డం వైసీపీకి కూడా చాలా క‌ష్టం. ఇందుకు ఇటీవ‌ల వైవీ సుబ్బారెడ్డి ఉదంత‌మే మంచి ఉదాహ‌ర‌ణ‌. జ‌గ‌న్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మ‌న్‌గా నియ‌మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు ఆయ‌న క్రిష్టియ‌న్ అని పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్రారంభ‌మైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే కాకుండా జాతీయ స్థాయిలో ఇది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైవీ సుబ్బారెడ్డి ప‌క్కా హిందువు అనే విష‌యం తెలియ‌ని నెటిజ‌న్లు జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌ర్వాత ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌డానికి వైసీపీ చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.

గ‌తంలో విజ‌య‌మ్మ స‌భ‌ల‌కు బైబిల్ ప‌ట్టుకొని రావ‌డం కూడా పెద్ద వివాదం అయ్యింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు సైతం ఆయ‌న త‌న మ‌తానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న సైతం అనేక‌సార్లు వివాదాస్ప‌ద‌మైంది.

అయితే, వీటిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. వైఎస్ కుటుంబం క్రిష్టియ‌న్ మ‌తాన్ని ఆచ‌రిస్తుంద‌నేది ప్ర‌జ‌ల‌కు తెలుసు. కానీ, వారిని ప్ర‌జ‌లు ఎప్పుడూ ఒకే మ‌తానికి ప‌రిమితం చేయ‌లేద‌నేది 2004, 2009, 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలే చెప్పాయి. అయినా, బీజేపీ ఇదే అజెండాని న‌మ్ముకొని వైసీపీని టార్గెట్ చేయాల‌నుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కైతే త‌న ప్ర‌తీ చ‌ర్య‌లోనూ అన్ని మ‌తాలు త‌న‌కు స‌మాన‌మే అన్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి ఉంటుంది. ఇప్పుడు బీజేపీనే రంగంలోకి దిగి వైసీపీని టార్గెట్ చేయ‌డంతో వైసీపీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle