newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

వైసీపీని ఇరుకునపెట్టడం సాధ్యమేనా?

15-09-201915-09-2019 18:24:42 IST
2019-09-15T12:54:42.910Z15-09-2019 2019-09-15T12:54:38.788Z - - 14-10-2019

వైసీపీని ఇరుకునపెట్టడం సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ మౌత్ పీస్ అని విమర్శలు వచ్చినా పవన్ కళ్యాణ్ ఆ విమర్శలనుంచి బయటపడాలని తపన పడుతున్నారు. వైసీపీపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు జనసేన సిద్ధమైందని, ఇకపై ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరికొత్త రాజకీయ పోరాటాలు చేస్తామని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైసీపీకి తామిచ్చిన 100 రోజుల గడువు ముగిసిందని, ప్రజలకు అండగా ఉండేందుకు నిర్థిష్టమైన ప్రణాళిక తీసుకుని, ముందుకు వెళ్లబోతున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులు ఉండగా, వాలంటీర్ల పేరుతో సమాంతర వ్యవస్థను సిద్ధపరుస్తున్నారన్నారు. 

వైసీపీ వాలంటీర్‌ వ్యవస్థను పవన్ దుయ్యబట్టారు.  కొరియర్‌ సర్వీస్‌ అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. టీడీపీ జన్మభూమి కమిటీ లతో ఎలా దెబ్బతిందో.. వైసీపీ కూడా వాలంటీర్‌ వ్యవస్థతో దెబ్బ తింటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ అధ్యయనం చేసి రూపొందించిన ‘పారదర్శకత.. దార్శనికత లోపించిన వైసీపీ 100 రోజుల పాలన’ అనే నివేదికను ఆవిష్కరించారు. వందరోజుల పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, ప్రణాళికాబద్ధంగా నడవటం లేదన్నారు. వైసీపీ వంద రోజుల పాలన జన విరుద్ధమైన జనరంజక పాలన అని ఆరోపించారు.

ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 19 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని వారిని పట్టించుకునే నాథుడే లేడన్నారు.  ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి మొత్తం 40 లక్షలమంది ఇసుక కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీని కూల్చిన అంశాల్లో ఇసుక విధానం ఒకటని, అటువంటి ఇసుక విధానంలో కొత్త ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకతతో వ్యవహరించటంలేదని ఆయన మండిపడ్డారు.  సరైన ఇసుక విధానాన్ని ఈరోజు వరకూ ప్రకటించకపోవటం ప్రభుత్వ అసమర్థతత ఇంకేమిటన్నారు. 

రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణం పూర్తిగా పాడయిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలన్నీ తిరుగుముఖం పడుతున్నా, కనీసం ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరపటం లేదన్నారు.

అసలు అమరావతిలో రాజధాని ఉంటుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ధర్మకర్తలా వ్యవహరించాలే తప్పా.. వ్యాపారిలా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వటం లేదని, రైతుల కన్నీళ్ళు ఎవరు తుడుస్తారన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన తన స్వంత బాబాయి వైఎస్‌ వివేకా హత్య కేసును ఎందుకు నిగ్గుతేల్చలేకపోయారని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ నేరుగా వెళ్లినా ఏమాత్రం ఫలితం తేలలేదన్నారు. 33మందితో ప్రత్యేక టీంను వేసినా పురోగతి లేదని పవన్‌ చెప్పారు. అలాగే కొడికత్తి దాడి కేసు ఏ దశలో ఉందో స్పష్టత లేదన్నారు. వైఎస్‌ వివేకా, కోడి కత్తి కేసులను సీబీఐకు అప్పగించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   35 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   2 hours ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   3 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle