newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

28-02-202028-02-2020 07:30:19 IST
2020-02-28T02:00:19.219Z28-02-2020 2020-02-28T01:59:30.662Z - - 05-04-2020

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌బోతున్నాయి. మిగ‌తా పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు బ‌ల‌ప‌డేందుకు, త‌మ బ‌లాన్ని నిరూపించుకునేందుకు కేవ‌లం ఒక అవ‌కాశం మాత్రమే. కానీ, వైసీపీకి మాత్రం త‌ప్ప‌నిస‌రిగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో వైసీపీకి వేరే ఆప్ష‌న్ ఏమీ లేదు. ఒక‌వేళ వైసీపీ క‌నుక ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేక‌పోతే చాలా ర‌కాలుగా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

ముఖ్యంగా త‌న తొమ్మిది నెల‌ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనేక వివాదాస్ప‌ద‌, సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. మూడు రాజ‌ధానులు స‌హా అనేక విష‌యాల్లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతున్నాయి. వాటిపై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు జ‌గ‌న్ అప్పుడే ప‌రిపాల‌న‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని, ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని కూడా ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న పాల‌న‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రెఫ‌రెండంగా మార‌బోతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లానే వైసీపీ స‌త్తా చాటితే ప్ర‌తిప‌క్ష పార్టీ విమ‌ర్శ‌ల‌న్నీ కొట్టి పారేసిన‌ట్ల‌వుతుంది. ప్ర‌జ‌లు త‌మ నిర్ణ‌యాల‌ను, త‌మ పాల‌న‌ను ఆమోదించార‌ని వైసీపీ నిరూపించిన‌ట్ల‌వుతుంది. ఒక‌వేళ ఓడిపోతే మాత్రం ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌ను వ్య‌తిరేకిస్తున్నారనే ప్ర‌తిప‌క్షాల వాద‌న‌కు మ‌రింత బ‌లం వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల‌పై వైసీపీ క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది.

అయితే, పార్టీలో కుమ్ములాట‌లో, వ‌ర్గ‌విభేదాలు మాత్రం స్థానిక సంస్థ‌ల ముందు డేంజ‌ర్ బెల్స్ మొగిస్తున్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిదేళ్ల త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ గ్రామాల్లో, క్షేత్ర‌స్థాయిలో త‌మ పెత్త‌నం న‌డ‌వాల‌ని అధికార పార్టీ క్యాడ‌ర్ ప్ర‌య‌త్నించ‌డం స‌హ‌జం. అయితే, ఈ విష‌యంలో స్వంత పార్టీలోనే అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర్గ‌పోరు నెలకొంది. దీంతో వారానికి రెండుమూడు చోట్ల వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు, భౌతిక దాడులు జ‌రుగుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న జ‌గ‌న్ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అప్ప‌టివ‌ర‌కు ఇంఛార్జిలుగా ఉన్న వారిని ప‌క్క‌న‌పెట్టి బ‌ల‌మైన అభ్య‌ర్థులుగా భావించిన కొత్త వారిని, ఇత‌ర పార్టీల వారిని చేర్చుకొని టిక్కెట్లు ఇచ్చారు.

వీరిలో చాలా మంది గెలిచారు. గెలిచిన త‌ర్వాత పాత వారికి, కొత్త‌గా చేరిన వారి వ‌ర్గానికి మ‌ధ్య విభేదాలు ఉన్నాయి. స్థానిక ఎన్నిక‌ల్లో ఇలా రెండు వ‌ర్గాల‌కు చెందిన వారి అనుచ‌రులు టిక్కెట్ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది రానురాను ఇంకా ఎక్కువ గొడ‌వ‌ల‌కు దారి తీసే అవ‌కాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. మరి, ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌క‌పోతే మాత్రం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది.

 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   13 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   14 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   16 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   17 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   20 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   20 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle