newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

వైద్యఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ

03-06-201903-06-2019 15:53:22 IST
Updated On 24-06-2019 17:11:11 ISTUpdated On 24-06-20192019-06-03T10:23:22.304Z03-06-2019 2019-06-03T10:23:09.317Z - 2019-06-24T11:41:11.483Z - 24-06-2019

వైద్యఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఒక్కో శాఖపై ఆయన సమీక్షలు చేస్తున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షనిర్వహించారు. ఆ శాఖ పనితీరును మెరుగుపరిచి సమూలంగా ప్రక్షాళన చేయాలని, దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలను అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు జగన్.

Image may contain: 1 person, smiling, sitting

కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ వైద్య ఆరోగ్య శాఖ సమూల ప్రక్షాళనకు ఆరోగ్యరంగం నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున సమన్వయ పరుస్తారన్నారు.

ఈ కమిటీ- వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో సమాలోచనలు జరిపి 45 రోజుల్లో తగు సూచనలతో నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందచేస్తుందన్నారు. అవినీతికి ఏ మాత్రం ఆస్కారం ఉన్నా సహించేది లేదని, ధికారులు తమ సొంత బాధ్యతగా భావించి పని చేయాలని సీఎం జగన్ సూచించారు. 

తాము పని చేసే ప్రతి విభాగం తమ సొంతదని భావిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయన్నారు జగన్. వైద్య ఆరోగ్య రంగంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానాలే మనందరికీ ఆదర్శం కావాలన్నారు. వైఎస్ఆర్ అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108  సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని, మొత్తం 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి, వాహనాలు పూర్తి స్థాయిలో ఆపరేషన్ లో ఉండేలా చేయాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు. చంద్రబాబు హయాంలో నిర్వీర్యమయిన వైద్య ఆరోగ్య శాఖకు పునర్వైభవం తేవాలన్నారు. ఆరోగ్య పరిరక్షణ విషయంలో దేశమంతా మన వైపే చూడాలన్నారు జగన్.

ఆరోగ్యశ్రీని ఇక నుండి ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’  గా పేరు మార్చాలని  ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ శాఖ తనకు అత్యంత ప్రాధాన్యతతో కూడినదని, తానే ప్రత్యక్షంగా ఈ శాఖ పనితీరును పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్‌ల స్థితిగతులు, పనితీరుపై ఒక నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.10,000 కు పెంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

ప్రతి ఆరోగ్య కేంద్రం, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయి అవసరాలు ఏమిటి, ప్రభుత్వం నుండి ఏమి కావాలి, మౌలికంగా, ఆర్థికంగా ఎటువంటి అవసరాలు తీర్చాలి.. ఇలా అన్ని వివరాలను తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో వాటన్నిటిని సమకూర్చి ప్రైవేటు ఆస్పత్రుల కన్నా మెరుగ్గా వాటి స్థితిగతులను మెరుగు పరచడానికి సంకల్పించినట్టు చెప్పారు ముఖ్యమంత్రి.

లెక్కలు కేవలం డాష్ బోర్డ్ లకు పరిమితం అయ్యాయని, వాస్తవాలకు దగ్గరగా అందరు పని చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు . ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు అన్నిటి ఫొటోగ్రాఫ్ లను తీసి చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈసందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై సానుకూలంగా స్పందించారు. పోస్టుల భర్తీ, ఆర్ధిక అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై నివేదికను తక్షణమే రూపొందించాల్సిందిగా  అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల్లో చోటుచేసుకున్న విపరీత ధోరణులను ఆయన ప్రస్తావించారు. రోగులను ఎలకలు కోరికేయడం, ఆపరేషన్ ధియేటర్లలో విద్యుత్ సరఫరా అందక సెల్ ఫోన్ లైట్లతో శస్త్ర చికిత్స జరగడం.. వంటి సంఘటనలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు సీఎం జగన్.

వైద్య విద్య లో ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి అడ్డంకులు ఎందుకు రావాలి. సౌకర్యాలు లేవని సీట్ల కేటాయింపు చేయకపోతే దానిపై ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోకూడదని అధికారులను ప్రశ్నించారు సీఎం. 

నిబంధనలను వెంటనే సమీక్షించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా వైద్య విద్య అందేలా చర్యలు చేపట్టాలని సూచించిన సీఎం. నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి.

ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే సరైన ధరలకు, నాణ్యమైన మందులు లభిస్తాయని విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు ఉండాలని అధికారులను కోరారు జగన్. వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాలు టెండరింగ్ విధానాలను పునఃసమీక్షించాలన్నారు. మొత్తం వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలన్నారు సీఎం జగన్. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle