newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

వైట్ పేప‌ర్ల‌తో పార్టీల ఫైట్‌

11-07-201911-07-2019 07:23:12 IST
Updated On 11-07-2019 11:38:54 ISTUpdated On 11-07-20192019-07-11T01:53:12.021Z11-07-2019 2019-07-11T01:52:57.752Z - 2019-07-11T06:08:54.066Z - 11-07-2019

వైట్ పేప‌ర్ల‌తో పార్టీల ఫైట్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త ఐదేళ్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించేది. ముఖ్యంగా అప్ప‌టి ప్ర‌భుత్వం ఎడాపెడా అప్పులు చేసి ఆ భారం ప్ర‌జ‌ల‌పై మోపుతోంద‌ని, వృద్ధి రేటు ఎక్కువ చూపిస్తోంద‌నే వైసీపీ ప‌దేప‌దే ఆరోపించేది.

ఇప్పుడు సీన్ మారి అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షంలోకి చేర‌గా వైసీపీ అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకుంది. మరికొద్దిగంటల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద‌టి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. అయితే, గ‌త ఐదేళ్లుగా చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను వైసీపీ ఇప్పుడు కూడా కొన‌సాగించింది. గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దిగ‌జార్చింద‌ని ఆరోపిస్తున్న వైసీపీ ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్ర‌జ‌ల ముందు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. 

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ముందుగా చెప్పిన‌ట్లే చంద్ర‌బాబు పాల‌న‌లోని త‌ప్పుల‌ను మ‌రోసారి ఎత్తి చూపించే ప్ర‌య‌త్నం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌స్థుత రాష్ట్ర ప‌రిస్థితిపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. 

ఇప్పుడు ఈ శ్వేత‌ప‌త్రాల‌పై వైసీపీ - టీడీపీ మ‌ధ్య వార్ మొద‌లైంది.  2004 నుంచి 2009 వ‌ర‌కు మాత్ర‌మే ఏపీ అన్ని ర‌కాలుగా వృద్ధి చెందింద‌ని, చంద్ర‌బాబు పాలించిన 2014 - 2019 మాత్రం రాష్ట్రానికి క‌ష్ట‌కాల‌మ‌నేది ప్ర‌భుత్వ వాద‌న‌. 

చంద్ర‌బాబు ప్ర‌తీయేడు రాష్ట్రం వృద్ధి రేటు గురించి చెప్పిన లెక్క‌ల‌న్నీ డొల్ల‌వ‌ని బుగ్గ‌న ఆరోపించారు. గ‌త ఐదేళ్ల‌లో పెద్ద ఎత్తున అప్పులు చేశార‌ని, జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయ‌వ‌ద్ద‌ని, కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అంత‌కుమించి అప్పులు చేసింద‌ని చెప్పారు.

అన్ని శాఖ‌ల‌కు నిధులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, కొంద‌రికి జీతాలు కూడా చెల్లించ‌లేద‌ని బుగ్గ‌న ఆరోపించారు. అయితే, వైసీపీ శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేయ‌డం వెనుక ప‌క్కా ప్లాన్ క‌నిపిస్తోంది. తాము అధికారంలోకి వ‌చ్చే నాటికి రాష్ట్రం ఏ ప‌రిస్థితిలో ఉందో ప్ర‌జ‌ల‌కు చెబితే భ‌విష్య‌త్‌లో ఉప‌యోగ‌మ‌ని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, టీడీపీ మాత్రం శ్వేత‌ప‌త్రాల వ్య‌వ‌హారంపై మండిప‌డుతోంది.

శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేయ‌నియ్యండి.. చూద్దాం అని చంద్ర‌బాబు నాయుడు ఆహ్వానించారు. శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌గానే మాజీ ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మీడియా ముందుకు వ‌చ్చారు. బుగ్గ‌న చెప్పిన లెక్క‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఘ‌న‌త త‌మ‌దేనని చెప్పారు. వ‌రుస‌గా ఐదేళ్లు రెండంకెల వృద్ధి రేటు సాధించామ‌న్నారు.

హామీల‌ను అమ‌లు చేయ‌లేక‌నే వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై త‌ప్పుడు లెక్క‌లు చెబుతోంద‌ని, అప్పులు అనే సాకును వెతుక్కుంటుంద‌నేది ఆయ‌న వాద‌న‌. మొత్తంగా బ‌డ్జెక్‌కు ముందే శ్వేత‌ప‌త్రాల‌తో వైసీపీ, టీడీపీ మ‌ధ్య వార్ మొద‌లైంది. ఒక అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ అంశాల‌పై మ‌రింత హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు జ‌రగ‌డం ఖాయం.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle