newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

వైఎస్ హయాంలో సబిత.. జగన్ సర్కార్‌లో సుచరిత

17-06-201917-06-2019 09:48:33 IST
Updated On 21-06-2019 16:08:14 ISTUpdated On 21-06-20192019-06-17T04:18:33.668Z17-06-2019 2019-06-17T04:18:16.184Z - 2019-06-21T10:38:14.731Z - 21-06-2019

వైఎస్ హయాంలో సబిత.. జగన్ సర్కార్‌లో సుచరిత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం దక్కిందనే చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి మహిళకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు. అప్పట్లో చేవెళ్ల ఎమ్మెల్యే, దివంగత మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి భార్య సబితకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

Image result for ys rajasekhara reddy and sabitha

మళ్ళీ వైఎస్ తనయుడు ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో మహిళలకు మంచి హోదా ఇచ్చారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రిగా మేకతోటి సుచరితను నియమించారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రిగా సుచరిత.. సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అందరి సహకారంతో ఈ శాఖలో తనదైన ముద్ర వేసేందుకు సుచరిత అడుగులు వేస్తున్నారు.

Woman and Tribal Police Battalions In The State - Sakshi

రాష్ట్రంలో కొత్తగా మహిళ, గిరిజన పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో నాలుగు ఏపీఎస్‌పీ బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం మొదటగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు. పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా చేస్తామన్నారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీఆఫ్‌ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 

సుచరిత హోంమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తన మార్కు పాలన ప్రారంభించారు. ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్‌ చేసి నాలుగు నెలల కిందట జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి సుచరిత వివరించారు. ఓ చిన్నారి పట్ల ఫాస్టర్‌ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె తెలిపిందన్నారు.

Image result for ys jagan and sucharita

ఆ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి ఫాస్టర్‌ పారిపోయారని, రెండు రోజులకు ఆ పాస్టర్‌ని పట్టుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారని మంత్రి తెలిపారు.

మొత్తం మీద ఒక మహిళను హోంమంత్రిగా నియమించడం పట్ల జగన్ నమ్మకం ఎలాంటిదో అర్థం అవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో జగన్ పయనిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle