newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్‌..!

13-09-201913-09-2019 08:55:01 IST
Updated On 15-09-2019 17:35:17 ISTUpdated On 15-09-20192019-09-13T03:25:01.015Z13-09-2019 2019-09-13T03:20:39.294Z - 2019-09-15T12:05:17.667Z - 15-09-2019

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి  వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. వైఎస్ వివేకా హ‌త్య జ‌రిగి ఆరు నెల‌లు పూర్త‌వుతున్నా హ‌త్య చేసింది ఎవ‌రు..?  చేయించింది ఎవ‌రు..? హ‌త్య చేయ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..?  ఆర్థిక వ్యవ‌హారాలా..? లేక ఫ్యామిలీ పాలిటిక్సా...? ఈ నేప‌థ్యంలో పోలీసులు వివ‌రాల‌న్నీ తెలిసే జాప్యం చేస్తున్నారా..? ఇంత‌కీ వివేకా హ‌త్య కేసులో ఏం జ‌రుగుతోంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఏపీ రాజ‌కీయ విశ్లేష‌కులు వారి అభిప్రాయాల‌ను ఇలా చెప్పుకొస్తున్నారు.

మార్చి 15న దారుణ హ‌త్యకు గుర‌య్యారు.  హ‌త్య జ‌రిగిన రోజు నుంచి ఇప్పటి వ‌ర‌కు సిట్ అధికారులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కార‌మే 1300 మందిని విచారించారు.కీల‌క అనుమానితులుగా భావిస్తున్న పరమేష్, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య, ఎర్ర గంగిరెడ్డిల‌ను నార్కో బ్రింగ్ మ్యాపింగ్ ప‌రీక్ష‌ల నిమిత్తం గుజ‌రాత్‌కు త‌ర‌లించి ప‌రీక్ష‌లు నిర్వహించారు.

అయితే ఈ న‌లుగురిలో ప‌సునూరు ప‌ర‌మేశ్ నార్కో ప‌రీక్షల‌కు నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెంద‌డంతో ఒక్కసారిగా ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేగింది.

సిట్ అధికారుల వేధింపులు తాళ‌లేక ఆత్మహత్య చేసుకున్నాడ‌ని మృతుడి బంధువులు ఆరోపించారు. ఇక్కడే సిట్ అధికారుల‌కు వ‌చ్చిన అనుమానాలు కేసు ద‌ర్యాప్తుకు కీల‌కంగా మారిన‌ట్టు తెలుస్తుంది.

క్రిమిన‌ల్ మైండ్ ఉన్న శ్రీ‌నివాస్‌రెడ్డి ఒక్కసారి విచార‌ణ‌కే ఆత్మహ‌త్య చేసుకున్నాడా..? ఈ కోణంలో విచార‌ణ జ‌రిపిన సిట్ టీమ్‌కు కొత్త కొత్త కోణాలు తెలిసిన‌ట్టు స‌మాచారం.

దీంతో వెత‌క‌బోతే తీగ కాలికి త‌గిలిన‌ట్టు ద‌ర్యాప్తు సంస్థ శ్రీ‌నివాస్ రెడ్డి మృతి వెనుక కార‌ణాలు ఏమై ఉంటాయ‌న్న కోణంలో ఆరా తీయ‌డం ప్రారంభించింది. శ్రీ‌నివాస్‌రెడ్డి పోస్టుమార్టం రిపోర్టుతోపాటు రాసిన సూసైడ్ లెట‌ర్‌ను విశ్లేషిస్తోంది.

మొత్తానికి విశ్వస‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం శ్రీ‌నివాస్‌రెడ్డిని హ‌త్య‌చేసి ఆత్మ‌హ‌త్య‌గా క్రియేట్ చేసిన‌ట్టు ద‌ర్యాప్తు బృందం ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానిత మృతి రోజు పసునూరు ప‌ర‌మేశ్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు కేసు ద‌ర్యాప్తును ప‌క్కదోవ ప‌ట్టించేలా ఉన్నట్టు సిట్ బృందం భావిస్తోంది. శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానిత మృతి కేసును ఛేదిస్తే వివేకానంద‌రెడ్డి కేసులో ద‌ర్యాప్తు పురోగ‌తి సాధించిన‌ట్టే అన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా శ్రీ‌నివాస్‌రెడ్డి రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ అత‌ను రాసింది కాద‌న్న నిర్దార‌ణ‌కు సిట్ అధికారులు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. శ్రీ‌నివాస్‌రెడ్డి ఎడ‌మ‌చేతివాటం ఉన్న వ్య‌క్తి కానీ ఆయ‌న సూసైడ్‌లో ఉన్న చేతిరాత కుడిచేతి వాటం వ్య‌క్తి రాత‌లాగా ఉంది.

దీంతో శ్రీ‌నివాస్‌రెడ్డి మృతి వెనుక  ఎవ‌రు ఉన్నారో తేలితే  వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో మిస్ట‌రీ వీడిన‌ట్టేన‌ని సిట్ బృందం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఎంత క‌రుడుగ‌ట్టిన నేర‌గాడైనా ఎక్క‌డో ఒక‌చోట పొర‌పాటు చేస్తాడ‌ని శ్రీ‌నివాస‌రెడ్డి అనుమానాస్ప‌ద మృతి త‌మ‌కు అందివ‌చ్చిన ఆయుధంగా సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   39 minutes ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   17 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   18 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle