newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

21-02-202021-02-2020 15:05:14 IST
Updated On 21-02-2020 16:11:30 ISTUpdated On 21-02-20202020-02-21T09:35:14.052Z21-02-2020 2020-02-21T09:35:07.377Z - 2020-02-21T10:41:30.225Z - 21-02-2020

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు సరిగా సాగడం లేదంటూ కేసుని సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించింది ధర్మాసనం. సిట్ ఇప్పటి వరకు కేసులో చేసిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో న్యాయమూర్తికి అందజేశారు ఏజీ. సిట్ విచారణ దాదాపు పూర్తి కాబోతోందని ధర్మాసనానికి తెలిపారు. ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని న్యాయమూర్తికి వివరించారు ఏజీ. 

దీంతో కేసుకు సంబంధించిన జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీ ని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. ఈ కేసుతదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కేసులో పురోగతి లేదని వివేకా కూతురు సునీతారెడ్డి పిటిషన్ వేశారు. కేసుని సీబీఐకి అప్పగించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్లో ఆమె కొందరు పేర్లు పేర్కొనడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. 

వాచ్ మన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, సీఐ శంకరయ్య,ఎఎస్ఐ రామకృష్ణా రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేర్లు ఆమె సూచించారు.

ఘటనా స్థలంలో వున్న తమ కుటుంబ సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత కొందరిపై తనకు అనుమానాలున్నట్టు ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా ఈ కేసులో విచారించింది సిట్. ఈ కేసులో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్‌..!


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle