newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

వైఎస్ వివేకానంద మృతి: అనుమానాలు

15-03-201915-03-2019 12:06:20 IST
2019-03-15T06:36:20.291Z15-03-2019 2019-03-15T06:36:17.557Z - - 20-09-2019

వైఎస్ వివేకానంద మృతి: అనుమానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మిక మృతిపై పలు అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందని, అయితే అక్కడి పరిసరాలు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా భావించి, దర్యాప్తు చేయాలని కోరుతున్నామన్నారు. జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో వివేకానందరెడ్డి ఇంటికి చేరుకోనున్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు. 

ప్రస్తుతం వివేకానందరెడ్డి మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టమ్ నిర్వహించిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు విజయసాయిరెడ్డి. వివేకానంద రెడ్డి మృతి చెందిన సందర్భాల్లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. వివేకానందరెడ్డి అంత్యక్రియలు.. ఈ రోజు, లేదా రేపు జరగొచ్చని ఆయన తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూంలో వివేకానందరెడ్డి మృతిచెందారు. అయితే ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు అయినట్లుగా పీఏ గుర్తించారు. దీనిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

గురువారం నాడు పులివెందులలో జగన్ తరఫున వివేకా ఎన్నికల ప్రచారం నిర్వహించారని పార్టీ నేతలు అంటున్నారు. అనంతరం ఇంటికి చేరుకునేసరికి అర్థరాత్రి కావడంతో అలాగే నిద్రపోయారని, ఉదయం నలతగా ఉందని, వాంతులు అవుతున్నాయని బాత్‌రూంలోకి వెళ్లారని పీఏ చెబుతున్నారు. అక్కడ వాంతులు చేసుకునే క్రమంలో పడిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయారంటున్నారు.  వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించి నిజానిజాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle