newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వైఎస్ వివేకాది హత్యే... సిట్ దర్యాప్తు

15-03-201915-03-2019 17:31:24 IST
Updated On 16-03-2019 15:20:17 ISTUpdated On 16-03-20192019-03-15T12:01:24.084Z15-03-2019 2019-03-15T12:00:54.942Z - 2019-03-16T09:50:17.492Z - 16-03-2019

వైఎస్ వివేకాది హత్యే... సిట్ దర్యాప్తు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం వెనుక కుట్రకోణం ఉందని, ఇది హత్యేనని తేలుతోంది. దీంతో ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉందన్న అనుమానాలు తొలుస్తున్నాయి. పోలీసులు ఈ దిశగా తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వైఎస్ వివేకానందరెడ్డికి ఎవరితోనూ శతృత్వం లేదు. ఆయన వైఎస్ కుటుంబంలోనే శాంతస్వభావుడిగా పేరుంది. 

అయితే వైఎస్ వివేకాను హత్య చేయడానికి బలమైన కారణాలు ఏం ఉంటాయన్నది అర్థం కావడం లేదు. మంత్రిగా పనిచేసినా, ఎంపీగా పనిచేసినా ఆయన ప్రజలతో మమేకమయ్యే వారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని వైసీపీ కార్యకర్తలు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

గతంలో అనేకసార్లు వివేకానందరెడ్డి. ఎటువంటి రక్షణ లేకుండా కూడా పులివెందుల్లో పర్యటించేవారని, అప్సుడు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఉండేది కాదన్నారు. ఈ కేసుకి సంబంధించి సిట్ దర్యాప్తు సాగుతోంది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయణ్ని కత్తితో పొడిచి హత్య చేసినట్లు తేలింది.తలలో రెండు వైపులా కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని.. ఛాతి, చేతిపైనా కత్తి పోట్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. 

అయితే వైసీపీ నేత మాజీ ఎంపీ, వివేకానందరెడ్డి బంధువు అవినాష్ రెడ్డి ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి ఉదయం బాత్ రూంలో పడిపోయారు. గుండెపోటుతో ఆయన చనిపోయారని భావించారు. ఆయనది సహజ మరణం అనుకున్నారు.  కానీ పోస్టుమార్టం నివేదిక అనంతరం ఆయన శరీరంపై ఏడు చోట్ల గాయాలు ఉండటంతో ఎవరో కావాలని హత్య చేసి ఉంటారని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వైయ‌స్ వివేకానంద‌రెడ్డి పార్ధీవ‌దేహాన్ని చూసి క‌న్నీటి ప‌ర్యంత‌ అయ్యారు వదిన  వైయ‌స్ విజ‌య‌మ్మ. 

వైఎస్ వివేకానందరెడ్డిని ఇటీవలే జమ్మలమడుగు పార్టీ కార్యక్రమాలను చూసుకోవాలని పార్టీ ఆదేశించింది. అక్కడ సుధీర్ రెడ్డి పోటీలోకి దిగుతుండటంతో ఆయనకు మద్దతుగా ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారాన్ని కూడానిర్వహించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్యకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ దీనిని హత్యగానే భావిస్తున్నామని, రాత్రి 11.30గంటల నుంచి 5.30 గంటల మధ్య ఏం జరిగిందో విచారిస్తున్నామని చెప్పారు.

శరీరంపై ఏడు చోట్ల గాయాలు ఉండటం కూడా హంతకులు ఎక్కడి వారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle