newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

వైఎస్ విజ‌య‌మ్మ‌ను ఓడించినా.. విశాఖ‌పై జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

23-12-201923-12-2019 12:57:00 IST
2019-12-23T07:27:00.850Z23-12-2019 2019-12-23T07:26:51.963Z - - 19-01-2020

వైఎస్ విజ‌య‌మ్మ‌ను ఓడించినా.. విశాఖ‌పై జ‌గ‌న్ వ్యూహం ఇదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా  ఉంటారనే పేరున్న ఓ ప‌త్రాకాధినేత వారం వారం త‌న ప‌త్రిక‌లో ఒక ఆర్టిక‌ల్ రాస్తూ ఉంటారు. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పైన ఆ ఆర్టిక‌ల్‌లో కూలంకషంగా చ‌ర్చిస్తుంటారు. ఈ వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల అంశంపైన ఆయన త‌న ఆర్టిక‌ల్‌లో చ‌ర్చించారు.

చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా ఉంటారు క‌నుక ఆయ‌న త‌న వ్యాసంలో వ్య‌క్తంచేసే  అభిప్రాయాలు, వివ‌రాల‌ను చంద్ర‌బాబు మ‌నసులో మాట‌కు సంబంధించిన అభిప్రాయాలు, వివ‌రాలుగా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ వారం త‌న ఆర్టిక‌ల్‌లో ఆ ప‌త్రికాధినేత కొన్ని కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తారు. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు ప‌రోక్షంగా ఒక హెచ్చ‌రిక జారీ చేశారు.

ఇవాళ అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌ల‌కు ప‌ట్టిన గ‌తే భ‌విష్య‌త్తులో విశాఖ ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌ద‌న్న గ్యారెంటీ లేదు కదా.?? అని ప్ర‌శ్నించాడు. ఈ హెచ్చ‌రిక‌ను త‌న వ్యాసంలో ప‌దే ప‌దే ప‌త్రికాధినేత గుర్తు చేశారు. అదే స‌మ‌యంలో క‌ర్నూలులో హైకోర్టు పెట్ట‌డం వ‌ల్ల అక్క‌డి వారికి ఏమీ ఉప‌యోగం ఉండ‌దు. జెరాక్స్ సెంట‌ర్‌లు న‌డుపుకునే వారికి మాత్ర‌మే ఉప‌యోగం ఉంటుందంటూ అవ‌హేళ‌న కూడా చేశారు. టీడీపీ ప‌త్రికాధినేత వ్యాసంలో ఈ రెండు అంశాలే కీల‌కంగా క‌నిపించాయి.

ఇప్పుడు అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు ప‌ట్టిన గ‌తే భ‌విష్య‌త్తులో విశాఖ ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌ద‌న్న గ్యారెంటీ లేదు క‌దా..? అని ప‌త్రికాధినేత వ్యాఖ్యానించ‌డం ద్వారా ఒక‌వేళ తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ గెలిచి చంద్ర‌బాబు తిరిగి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి సీఎం అయితే విశాఖ‌ప‌ట్నంలో విశాఖ‌ప‌ట్నంలో ప‌రిపాల‌న రాజ‌ధానిని కొన‌సాగించ‌క‌పోవ‌చ్చ‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు ఈ ప‌త్రికాధినేత ప‌రోక్షంగా హెచ్చ‌రిస్తున్న‌ట్టే ఉంది.

అదే స‌మ‌యంలో రాయ‌ల‌సీమ‌లో హైకోర్టు కోసం చాలా కాలంగా ఆ ప్రాంత ప్ర‌జ‌లు పోరాడుతూ వ‌చ్చారు. ఇప్పుడు ఈ టీడీపీ ప‌త్రికాధినేత కేవ‌లం హైకోర్టు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల కొన్ని జెరాక్స్ సెంట‌ర్‌ల‌కు మాత్ర‌మే ఉప‌యోగం ఉంటుంద‌ని చెప్ప‌డం ద్వారా భ‌విష్య‌త్తులో టీడీపీ తిరిగి అధికారంలోకి వ‌స్తే విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధానిని, క‌ర్నూలులో ఉన్న హైకోర్టును అక్క‌డ ఉపయోగం లేద‌న్న ఉద్దేశంతో తిరిగి అమ‌రావ‌తి త‌ర‌లిస్తార‌ని చంద్ర‌బాబు త‌రుపున ప‌రోక్షంగా ప‌త్రికాధినేత చెబుతున్న‌ట్టుగా ఉంది.

అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు ప‌ట్టిన గ‌తే.. భ‌విష్య‌త్తులో విశాఖ ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌దా..? అని హెచ్చ‌రిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తే విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని క‌ర్నూలులో ఏర్పాటుచేయ‌బోతున్న హైకోర్టు విష‌యంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆలోచ‌న చేయ‌బోతుంది..?  అన్న‌దానిపై అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు కాస్త లోతుగానే ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తుంది.

నిజానికి క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని రాయ‌ల‌సీమ ప్రాంత న్యాయ‌వాదులు, మేధావులు చాలా కాలంగా పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ పోరాట ఫ‌లితంగా ఇప్పుడు హైకోర్టు వ‌స్తే దానివ‌ల్ల ఏమీ ఉప‌యోగం ఉండ‌దు. కేవ‌లం మూడు, నాలుగు జెరాక్స్ సెంటర్లు వారికి మాత్ర‌మే ఉప‌యోగం ఉంటుంద‌ని టీడీపీ అనుకూల ప‌త్రికాధినేత చెబుతున్నారంటే ఇంత‌కాలం హైకోర్టు కోసం ఉద్య‌మం చేసిన న్యాయ‌వాదులు, అక్క‌డి మేధావులు, విద్యార్థి సంఘాలు పిచ్చివాళ్లు అని అనుకోవాల్నా..?

ఆ టీడీపీ ప‌త్రికాధినేత త‌న వ్యాసంలో మ‌రో కీల‌క అంశాన్ని కూడా ప్ర‌స్థావించారు. విశాఖ విష‌యంలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఉద్దేశించి ఒక కీల‌క అంశాన్ని చెప్పారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి తెలుసో.. తెలీదో కానీ.. విశాఖ‌లో కూడా క‌మ్మ‌వారు ఉన్నారు. మ‌రి ఆ విష‌యం తెలిసి.. తిరిగి అక్క‌డి నుంచి కూడా రాజ‌ధానిని త‌ర‌లిస్తారేమోన‌ని ప‌త్రికాధినేత అనుమానం వ్య‌క్తం చేశారు.

ఈ కీల‌క అంశంలో టీడీపీ ప‌త్రికాధినేత తెలుసుకోవాల్సింది ఏమిటంటే.?  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఓవ‌ర్‌నైట్ ముఖ్య‌మంత్రి అయిపోలేదు. దాదాపు ప‌దేళ్ల‌పాటు రాష్ట్ర‌మంతా తిరిగి, అన్ని ప్రాంతాల్లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌నోభావాలు తెలుసుకున్న త‌రువాతే.. రాష్ట్రంపై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చిన త‌రువాతే ఆయ‌న సీఎం అయ్యారు.

అటువంటిది విశాఖ‌లో ఆ సామాజిక‌వ‌ర్గం వారు ఉన్నార‌న్న విష‌యం తెలియ‌కుండా ఉండ‌దు. అదే విధంగా వారికి సంబంధించిన భూములు విశాఖ‌లో ఎక్కువ‌గా ఉంటాయ‌న్న విష‌య‌మూ తెలిసే ఉంటుంది. అలా అన్ని విష‌యాలు తెలిసిన జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ఎంపిక చేశారంటే ఒక సామాజిక‌వ‌ర్గం మీద వివ‌క్ష చూప‌ని త‌నంగానే మ‌నం భావించాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle