newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

వైఎస్ విగ్రహం.. వైవీ ఆవిష్కరణ.. ఇదేం లెక్క?!

02-12-201902-12-2019 15:09:22 IST
2019-12-02T09:39:22.578Z02-12-2019 2019-12-02T09:39:18.858Z - - 07-12-2019

వైఎస్ విగ్రహం.. వైవీ ఆవిష్కరణ.. ఇదేం లెక్క?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లు పల్లెల నుండి బస్తీల వరకు గల్లీ గల్లీకి మొదలైన విగ్రహాల హవా ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా మొదలుపెట్టారు. మేధావులు, సమాజంలో బలమైన ముద్రవేసి విద్యార్థులకు మంచి బుద్దులు మెదళ్లలో మొలకెత్తేందుకు ఈ విగ్రహాలు ఉపయోగపడాలన్నది వీటి ఉద్దేశ్యం. అయితే ఇప్పుడు మేధావుల స్థానంలో రాజకీయ నేతలు చేరారు. వారి విగ్రహాలు ఇప్పుడు యూనివర్సిటీలలో ఠీవిగా నిలబడుతున్నాయి.

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆ నాగార్జునుడి విగ్రహమే చిన్నదిగా ఒక మూలాన ఉంటుంది. కానీ ఇప్పుడు యూనివర్సిటీ ప్రధాన భవనం ఎదుట.. నాగార్జుడి విగ్రహానికి మూడింతల పెద్దదిగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజాగా ఈ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి వరసకు చిన్నాన్న అయిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.

అప్పుడెప్పుడో వైఎస్ బ్రతికున్నపుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి ఇచ్చారన్న కారణంగా ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఓ వింత కాగా.. ఆ విగ్రహాన్ని ప్రభుత్వంతో కానీ యూనివర్సిటీతో కానీ.. విద్యాశాఖతో కానీ ఎలాంటి సంబంధం లేని వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించడం మరోవింతగా మారింది.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీకి చైర్మన్ కాగా విద్యావ్యవస్థతో కానీ యూనివర్సిటీతో కానీ అధికారికంగా ఎలాంటి సంబంధం ఉండదు. పోనీ ఓ రాజకీయ నేత విగ్రహం కదా మరో రాజకీయ నేత ఆవిష్కరించారు అనుకుందామా అంటే సుబ్బారెడ్డి కనీసం ఆ జిల్లాకు సంబంధం ఉన్న నేత కూడా కాదు. అయనను మించిన నేతలు.. ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్న నేతలు కూడా ఆ జిల్లాలో చాలామందే ఉన్నారు.

Image result for YS statue opening in anu

వారందరినీ పక్కనబెట్టి యూనివర్సిటీ అధికారులు వైవీ సుబ్బారెడ్డితోనే విగ్రహావిష్కరణ చేయించడమే ఆసక్తికరంగా మారింది. యూనివర్సిటీలో కార్యక్రమం కనుక ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వారు ఆవిష్కరించాలి. కానీ ఇక్కడ వైవీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న కనుకే ప్రోటోకాల్ అంశాన్ని పక్కన పెట్టేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిని చేసినట్లుగా కనిపిస్తుంది.

దీనికి తోడు వైవీ కూడా పేరుకే టీటీడీ చైర్మన్ అయినా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో ఫింగర్ బాగానే ఉంటుందని ఆ పార్టీలో అందరికీ తెలిసిందే. ప్రభుత్వంలో కూడా ఆయన జోక్యం తప్పక ఉంటుందనే వాళ్ళు లేకపోలేదు. ఇక ఇప్పుడు అసలు యూనివర్సిటీలో విగ్రహం కాన్సెప్ట్ కూడా తనదేనని.. ఆయనే దగ్గరుండి ఆ ఏర్పాట్లను అధికారులకు పురమాయించారని.. అందుకే ఆయనతోనే ఆవిష్కరణ జరిగిపోయినట్లుగా చెప్తున్నారు. అయినా యూనివర్సిటీలోకి రాజకీయ నేత విగ్రహం వెళ్ళినపుడు.. దాన్ని ఎవరు ఆవిష్కరిస్తే ఏముంది.. అంతా సర్వాంతర్యామేకదా!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle