newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వైఎస్ఆర్ మాదిరి జ‌గ‌న్ స‌రికొత్త ఫార్ములా..? వ‌ర్క‌వుట్ అవుతుందా..?

22-09-201922-09-2019 10:49:52 IST
2019-09-22T05:19:52.479Z22-09-2019 2019-09-22T05:19:50.146Z - - 08-12-2019

వైఎస్ఆర్ మాదిరి జ‌గ‌న్ స‌రికొత్త ఫార్ములా..?  వ‌ర్క‌వుట్ అవుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకానొక స‌మ‌యంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి  ఏపీ రాజ‌కీయాల‌కు స‌రికొత్త ఫార్ములాను ప‌రిచ‌యం చేశారు. ఒక‌రిపై ఒక‌రు ప‌గ‌లు పెంచుకున్న వ‌ర్గాల‌ను ఒక‌టి చేశారు. ఆ క్ర‌మంలోనే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, బిజ్జం పార్ధ‌సార‌ధిరెడ్డి వ‌ర్గాల ఒక్క‌ట‌య్యాయి. దీంతో అప్ప‌టి నుంచి పాణ్యంలో ఫ్యాక్ష‌న్‌కు తెర ప‌డిందని, మంచి సంప్ర‌దాయానికి బీజం వేసిన ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నిలిచిపోయార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఇప్ప‌టికీ చెబుతున్నారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్ వైఎస్ బాట‌లోనే ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తూర్పు గోదావ‌రిలో జిల్లాలో ఉప్పు, నిప్పులా ఉండే ఇద్ద‌రు నేత‌ల‌ను క‌లిపారు. ఆ ఇద్ద‌రు నేత‌ల్లో ఒక‌రు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్. మ‌రొక‌రు తోట త్రిమూర్తులు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే నిజాయితీగ‌ల నేత‌గా ఉన్న సుభాష్ చంద్ర‌బోస్‌కు సీఎం జ‌గ‌న్ డిప్యూటీ సీఎంను చేశాడు. ప్ర‌భుత్వంలో మంచి పోర్ట్‌ఫోలియో ఇచ్చాడు కూడా. ఇప్పుడు త్రిమూర్తులు కూడా వైసీపీలో చేరిపోయారు. రామ‌చంద్రాపురంలో ఇప్పుడు ఈ రెండు క‌త్తులు ఒకే ఒర‌లో ఉంటాయా..?  లేదా.? అన్న‌ది రాజకీయ‌వ‌ర్గాల్లో పెద్ద ప్ర‌శ్నగా మారింది.

కాగా, సుభాష్ చంద్ర‌బోస్‌ది శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గం. త్రిమూర్తుల‌ది కాపు సామాజిక‌వ‌ర్గం. ఈ ఇద్ద‌రు నేత‌లు వారి వారి సామాజిక‌వ‌ర్గంలో చ‌రీష్మా గ‌ల నేత‌లే. అయితే త్రిమూర్తులు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కంటే ముందు వైసీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌రి నిమిషంలో ఆయ‌న వేసుకున్న పొలిటిక‌ల్ లెక్క‌లు మారాయి. దీంతో అప్ప‌ట్లో ఆయ‌న వైసీపీలో చేరేందుకు వెనుకంజ వేశారు. ఎన్నిక‌ల త‌రువాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో ఇప్పుడు వైసీపీలో చేరిన‌ట్టు తెలుస్తుంది.

తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిక వెనుక సీఎం జ‌గ‌న్ పొలిటిక‌ల్ ప్లాన్‌లు ఉన్న‌ట్టు తెలుస్తుంది. రామ‌చంద్రాపురంలో త్రిమూర్తులు పిల్లి సుభాష్ చాలా కాలం నుంచి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు వీరిద్ద‌రిని క‌లిపి రెండు వ‌ర్గాల‌ను ఒక‌టిచేసి తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో కొత్త ఇండికేష‌న్ ఇవ్వొచ్చు. ఒక‌వేళ ఈ ఫార్ములా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అయితే అనంత‌పురంలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాలు, క‌డ‌ప‌లో ఒక నియోజ‌క‌వ‌ర్గం క‌ర్నూలులో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు క‌లిపేందుకు జ‌గ‌న్ వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

రాబోయే రోజుల్లో తూర్పు గోదావ‌రిని మూడు జిల్లాలుగా విభజించ‌బోతున్నారు. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం జిల్లాగా మార‌బోతోంది. ఈ లెక్క‌ల ప్ర‌కారం అమ‌లాపురం, రాజ‌మండ్రి, తూర్పు గోదావ‌రి జిల్లాలుగా మారుతుంది. కోన‌సీమ‌లో ఐదు నుంచి ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో తోట త్రిమూర్త‌ల ప్ర‌భావం ఉంటుంది. గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే బ‌ల‌మైన నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. అమ‌లాపురం జిల్లా ప‌రిధిలో త్రిమూర్తులు ఎఫెక్ట్ ఉంటుంద‌నేది ఆయ‌న వ‌ర్గం నేత‌ల అంచ‌నా.

తూర్పు గోదావ‌రి జిల్లాలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం కూడా ఉంది. రాకీయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దెబ్బ తీయాలంటే బ‌ల‌మైన కాపు నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిని జ‌గ‌న్ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 30 నుంచి 40 వేల ఓట్లు ప‌డ్డాయి. దీంతో ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపు తిప్పుకునేందుకు త్రిమూర్తుల‌ను వైసీపీలోకి తీసుకున్నార‌న్న‌ది ఓ టాక్.

రాబోయే రోజుల్లో బ‌ల‌మైన కాపు నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి కోన సీమ‌లో పొలిటిక‌ల్ ఫార్ములా ప్ర‌యోగించారు. అది వ‌ర్క‌వుట్ అవుతుందా..?  లేదా..? అన్న‌ది రాబోయే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తేలుతుంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle