newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వెలగపూడికి బై బై...మంగళగిరిపై జగన్ గురి

08-10-201908-10-2019 09:16:52 IST
2019-10-08T03:46:52.970Z08-10-2019 2019-10-08T03:46:42.732Z - - 08-12-2019

వెలగపూడికి బై బై...మంగళగిరిపై జగన్ గురి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ముఖ్యంగా ఏపీ సచివాలయం విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొని ఉంది. తాజాగా మరో సస్పెన్స్ తెరమీదకు వచ్చింది. 

ఏపీ రాజధాని మారే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలకు బలం చేకూర్చే పరిణామాలు జరుగుతున్నాయి. వెలగపూడిలో ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని మంగళగిరికి తరలించాలని కొందరు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు సీఎం జగన్ ని కోరినట్టు తెలుస్తోంది. 

వెలగపూడితో పోలిస్తే మంగళగిరి సచివాలయానికి ఎంత అనుకూలంగా ఉంటుందో సవివరంగా తెలియజేస్తూ ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డికి అందచేశారు. సీనియర్‌ అధికారుల నుండే ఈ ప్రతిపాదన రావడంతో సిఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. 

త్వరలో సచివాలయాన్ని మంగళగిరికి తరలించడం ఖాయమని.. జగన్ ప్రకటనే తరువాయి అంటున్నాయి రాజధానివర్గాలు. సచివాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర సచివాలయం వర్షాకాలంలో అనుకూలంగా ఉండడం లేదు. అందరికీ అనుకూలమయిన చోటు మంగళగిరి అంటున్నారు. అందులో భాగంగా నాగార్జున యూనివర్శిటిని ఎంపిక చేసే అవకాశం వుంది.

మంగళగిరిలో ఖాళీగా ఉన్న చోట సచివాలయాన్ని నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణాలు ఏడాదిలో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. 

ప్రతిరోజూ వెలగపూడిలోని సచివాలయానికి రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటోందని కొందరు అధికారులు అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  సుమారు వెయ్యికోట్లతో సచివాలయం నిర్మించినా, అధికారులు. ఉద్యోగుల కోసం తలపెట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తికాలేదు. జగన్ సీఎం అయ్యాక, వాటి నిర్మాణం కూడా ముందుకు సాగడం లేదు.  

ఈ  నిర్మాణాలు పూర్తయినా, పూర్తి స్థాయిలో వసతులు లేని ప్రాంతంలో ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి ఉండడం అంత ఈజీ కాదంటున్నారు. అన్ని సౌకర్యాలతో ఉన్న మంగళగిరి సచివాలయానికి అనుకూలంగా ఉంటుందని  ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

దీంతో త్వరలో వెలగపూడి నుంచి మంగళగిరికి సచివాలయం తరలింపు తథ్యం అంటున్నారు.  అలాగే, వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం మంగళగిరిలో భవనాలను వెతుకుతున్నారు అధికారులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle