newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!

08-12-201908-12-2019 13:49:31 IST
Updated On 11-12-2019 12:19:48 ISTUpdated On 11-12-20192019-12-08T08:19:31.708Z08-12-2019 2019-12-08T08:19:27.519Z - 2019-12-11T06:49:48.990Z - 11-12-2019

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరోసారి వెనక్కు తగ్గారు. అయన ప్రభుత్వంలో ఇప్పటికే కొన్ని జీవోలు ఇచ్చి వాటిలో మార్పులు చేయగా మరికొన్నిటిని పూర్తిగా రద్దు చేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి జీవోలను వెనక్కు తీసుకున్నారు. ఈసారి ఏకంగా ఆరు జీవోలను వెనక్కు తీసుకున్నారు. అవన్నీ కూడా జగన్ వ్యక్తిగతంగా నివాసాలకు, అదనపు సౌకర్యాలకు ప్రభుత్వ ఖజానా నుండి నిధులను విడుదల చేసే జీవోలు కావడం విశేషం.

జగన్ సీఎం అయ్యాక ఆరు నెలలుగా తాడేపల్లిలోని ఇంటి కిటికీలకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 259, అదే నివాసంలో ఫర్నీచర్ కొనుగోలు కోసం ఇచ్చిన జీవో నెంబర్ 308, సీఎంకు సంబంధించిన ఇళ్ల మెయిన్‌టనెన్స్‌ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 307, క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న తాడేపల్లి ఇంటికి ఏసీలు, ఇతర సదుపాయాల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 254ను రద్దు చేశారు.

ఇక గత నెలలోనే విడుదల చేసిన సీఎం జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ సౌకర్యల కోసం ఏపీ ప్రభుత్వ నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 160, అదే నివాసం కోసం కరెంట్ మెయిన్‌టనెన్స్ కోసం ఇచ్చిన జీవో నెంబర్ 327లను కూడా రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ జీవోల విషయంలో సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు తలెత్తాయి.

ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి కల్పించుకున్న ప్రతి సౌకర్యం తర్వాత వచ్చే ముఖ్యమంత్రులకు కూడా ఉపయోగపడాలి. ఈక్రమంలోనే సీఎంగా జగన్ దిగిపోయిన తర్వాత కిటికీలు, ఏసీలు ప్రభుత్వానికి అప్పగిస్తారా అంటూ తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ కోడెలను దొంగగా ముద్రవేశారని.. ఇప్పుడు జగన్ కూడా దొంగేనా అని ప్రశ్నలు లేవనెత్తారు.

అంతేకాదు కేవలం త్రాగే మంచినీళ్ల బాటిల్ విషయంలో కూడా లీటర్ నీళ్ళకి ఇరవై రూపాయలు మిగిలించే సీఎం పక్క రాష్ట్రంలోని నివాసాలకు కూడా ఏపీ ప్రజల సొమ్ములతో సోకులు చేయించుకుంటారా అని విమర్శలొచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లకు కిటికీలు పెట్టించుకొనే స్థోమత లేని సీఎం అంటూ సెటైర్లు కూడా వేశారు.

ఈక్రమంలోనే మొత్తానికి సొంత ఖర్చులకు నిధులను విడుదల చేసుకున్న ఆ ఆరు జీవోలను వెనక్కు తీసుకున్నారు. అయితే జీవోల విడుదల సమయంలో సీఎంకు తెలియకుండానే ఇచ్చారని వైసీపీ బృందాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఆరు జీవోలు సీఎంకు తెలియకుండా విడుదల అయ్యాయంటే అసలు ప్రభుత్వంలో ఏ జరుగుతుందో ఆలోచించాల్సిన విషయమే!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle