newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

వెంట న‌డిచిన వారికే చోటు

04-06-201904-06-2019 08:08:51 IST
Updated On 24-06-2019 16:50:00 ISTUpdated On 24-06-20192019-06-04T02:38:51.494Z04-06-2019 2019-06-04T02:38:48.687Z - 2019-06-24T11:20:00.135Z - 24-06-2019

వెంట న‌డిచిన వారికే  చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్యాబినెట్ కూర్పుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. 8వ తేదీన కొత్త క్యాబినెట్ మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే, జ‌గ‌న్ త‌న టీమ్ లో ఎవ‌రికి చోటిస్తార‌నే దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌స్తున్నాయి. మంత్రి ప‌ద‌వుల కోసం ఎమ్మెల్యేల్లో తీవ్ర పోటీ ఉంది.

ఏకంగా 151 మంది గెల‌వ‌డం, చాలామంది మంత్రులుగా ప‌నిచేసిన వారు, సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఉండ‌టంతో మంత్రిప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. బ‌య‌ట‌కు ఎవ‌రూ మాట్లాడ‌కున్నా మంత్రి ప‌ద‌వుల‌పై ఎమ్మెల్యేలు అనేక ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, సీనియారిటీ క‌న్నా ఎక్కువ‌గా విశ్వ‌స‌నీయ‌త‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీని విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు జ‌గ‌న్ తో 18 మంది ఎమ్మెల్యేలు వెంట న‌డిచారు. వీరంతా ఉప ఎన్నిక‌ల‌ను సైతం ఎదుర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. రాజ‌కీయంగానూ వీరంతా అనేక ఇబ్బందులు ప‌డ్డారు. అయినా జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్ని న‌మ్మి ఆయ‌న వెంట‌నే ఉన్నారు. దీంతో మంత్రి ప‌ద‌వుల పంప‌కంలో వీరికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం.

జ‌గ‌న్ పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న వెంటే ఉండి, మంత్రి ప‌ద‌వుల‌ను సైతం వ‌దులుకున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డం ఖాయం. కొడాలి నాని, గొల్ల బాబురావు, మేక‌తోటి సుచ‌రిత‌, శ్రీకాంత్ రెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ధ‌ర్మాన కృష్ణ‌దాస్ సైతం జ‌గ‌న్ తోనే ముందునుంచీ ఉన్నారు.

దీంతో వీరికి కూడా మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. కొంద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఈసారి వైసీపీ త‌ర‌పున గెలిచినా ముందునుంచీ త‌న వెంట ఉన్న వారికి, గ‌త ఎన్నిక‌ల్లోనూ వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన వారికే జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, బొత్స స‌త్యానారాయ‌ణ‌, ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి వంటి సీనియ‌ర్లు గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చినా సీనియ‌ర్లు అయినందున వారికి కూడా అవ‌కాశం ఇవ్వ‌వ‌చ్చు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle