newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

వెంకటాపురం గ్యాస్ లీకేజీ బాధితులకు భరోసా ఏదీ?

30-05-202030-05-2020 08:07:57 IST
Updated On 30-05-2020 11:11:34 ISTUpdated On 30-05-20202020-05-30T02:37:57.175Z30-05-2020 2020-05-30T02:37:17.673Z - 2020-05-30T05:41:34.538Z - 30-05-2020

వెంకటాపురం గ్యాస్ లీకేజీ బాధితులకు భరోసా ఏదీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ పేరు చెప్పగానే మనకు ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటన కళ్లముందు మెదులుతుంది. పిట్టల్లా రాలిపోయిన మనుషులు, విషవాయువు ధాటికి పాడైన పచ్చని చెట్లు, పశువులు.. ఇళ్ళపైన పేరుకుపోయిన స్టిరైన్ వాయువు... ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా....మసుషులపై విరుచుకుపడ్డ స్టిరైన్ వాయువు...మనుషులు ఆయువును తీసేసింది. మరి కొంతమందిని తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. ప్రస్తుతం ఆ ఘటన తలచుకుంటూ బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు ఆనుకొని ఉన్న వెంకటాపురం గ్రామంలో పరిస్థితుల్లో మార్పులు లేవు. 

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టిరైన్ వాయువు లీకేజీ ఘటనలో 13 మంది మృతి చెందగా...దాదాపుగా 4 వందల మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వాయువు లీకేజీ ప్రభావంతో చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలో సంభవించిన ఘటనతో వెంకటాపురం గ్రామస్తులు తలోపాపం...తిలా పిడికెడు అన్న చందంగా....తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు.మరికొంత మంది మృత్యువు ఒడిలో నిద్రలోకి జారుకున్నారు. ఘటన చోటుచేసుకున్న తరువాత పరిశ్రమ నిర్లక్ష్యం తీరుపై బాధిత గ్రామస్తులు ఆందోళనలు మిన్నంటాయి.ఐనా బాధిత కుటుంబాలకు బాసటగా ప్రభుత్వం నిలుస్తుందన్న భరోసా సన్నగిల్లిపోతుందని బాధిత గ్రామస్తులు మండిపడుతున్నారు.

ఇప్పుడిప్పుడే వెంకటాపురం గ్రామానికి చేరుకుంటున్న కుటుంబాలు ప్రస్తుతం తమ గృహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్టిరైన్ వాయువు ధాటికి గృహాలు పూర్తిగా నాశనం కావడం,పది అడుగుల పక్కనే ఎల్జీ పరిశ్రమ చిమ్మిన స్టిరైన్ వాయువు ఇళ్ళల్లో ఇప్పటికీ ఉండడటంతో లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఇళ్లల్లో ఉన్న నిత్యావసర వస్తువులు పూర్తిగా నాశనం కావడంతో తినడానికి తిండి,త్రాగేందుకు మంచినీళ్ళు కూడా లేకుండా పోతుందని బాధిత కుటుంబాలు వాపోతున్నారు.

అస్వస్థతకు గురై, నష్టపోయిన బాధిత కుటుంబాలకు వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. ఐతే ఇటీవలే...ఇళ్ళకు చేరుకున్న వారికి దీర్ఘకాలిక వ్యాధులు తప్పడంలేదని బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా కళ్ళు మంటలు,గుండెల్లో నొప్పి,వాంతులు కావడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని బాధితులు అంటున్నారు.కొంతమందికి నష్టపరిహారం కూడా అందకపోవడంతో పరిశ్రమ యాజమాన్యంతో పాటు అధికారులపై మండిపడుతున్నారు.

మరోవైపు ఉన్నఊరు...కన్న తల్లి అన్న చందంగా పరిశ్రమలోనుంచి వెలువడిన స్టిరైన్ వాయువు పది అడుగుల దూరంలో ఉన్న గృహాలు పూర్తిగా నాశనం కావడంతో ఇళ్ళను మరమ్మతులు చేసుకున్న క్రమంలో స్టిరైన్ వాయువు వాసన ఇంకా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబాలలో గత సంఘటన ఇంకా కళ్ళలో కనిపిస్తోందనిగ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ స్టిరైన్ వాయువు అందివచ్చిన కొడుకు ఆయువు తీసిందని పోలీసు కానిస్టేబుల్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతి చెందిన కుటుంబాలకు లక్షల రూపాయల పరిహారం ప్రకటించి వెంకటాపురం గ్రామస్తులతో ప్రభుత్వం పరిహాసం చేస్తోందని....కంటితుడుపు చర్యగా ప్రజాప్రతినిధులు ఒక్క రాత్రి బసచేసినంత మాత్రాన బాధితులకు న్యాయం చేసినట్లైయి పోతుందా అని మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ఎటువంటి కార్యకలాపాలు సాగించరాదని, పరిశ్రమ డైరెక్టర్ల పాస్ పోర్టులు బ్లాక్ చేయాలని,విదేశాలకు వెళ్లరాదని ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేసింది. 

ప్రస్తుతం వెంకటాపురం గ్రామంలో పరిశ్రమ యాజమాన్యంతో పాటు అధికారులు,ప్రజాప్రతినిధులు దిద్దుబాటు చర్యలు చేపట్టి గ్రామస్తులను బుజ్జగించడానికి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఐతే ఇంకా పరిశ్రమలో స్టిరైన్ నిల్వలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతోనే మళ్ళీ గ్రామంలో స్టిరైన్ వాయువు తమ గృహాల్లోకి వస్తుందని దీని ప్రభావంతో నిత్యావసర వస్తువులు పూర్తిగా పాడవడంతో తినడానికి తిండికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ఉన్న ఊరును వదలలేక...విషవాయువు పీల్చలేక చస్తూ బ్రతుకుతున్నామని వెంకటాపురం గ్రామస్తులు తమ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు.ప్రస్తుతం వెంకటాపురం గ్రామస్తులు గత ఘటనను తలుచుకుంటూ...పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలో ఉంటున్నారు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాలు వెంకటాపురం, నందమూరి నగర్ వాసులు నిరసనకు దిగారు. ఇళ్లలోనే ఉండి ప్లకార్డులతో ఆందోళన చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   10 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   11 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   11 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   12 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   12 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   13 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   13 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   15 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   15 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle