newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

వెంకటగిరి.... గురి ఎవరిది?

28-03-201928-03-2019 08:45:22 IST
Updated On 28-03-2019 18:52:31 ISTUpdated On 28-03-20192019-03-28T03:15:22.595Z28-03-2019 2019-03-28T03:15:12.838Z - 2019-03-28T13:22:31.947Z - 28-03-2019

వెంకటగిరి.... గురి ఎవరిది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో హాట్ సీట్‌గా మారింది నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం. అక్కడ పోటీచేస్తున్నది మాజీ ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని టీడీపీ సర్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆయన గెలుపు నల్లేరుమీద బండి నడక అని ధీమాతో వున్నారు వైసీపీ నేతలు. 

వెంకటగిరి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్. జమిందారీ వ్యతిరేక పోరాటం పురుడు పోసుకుంది వెంకటగిరిలోనే. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. వెంకటగిరి అంటే గుర్తుకు వచ్చేది వెంకటగిరి సంస్థానం, రాజా కుటుంబీకులు, చేనేత పరిశ్రమ. ఇక నియోజకవర్గంలోని రాపూరు మండలంలోని చెల్లటూరు వద్ద 1983లో నిర్మించిన కండలేరు జలాశయం. ఆసియాలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యామ్‌ ఇది. 

వెంకటగిరి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ కలిగిన వెంకటగిరి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించాయి. నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో మైకామైన్‌ పరిశ్రమ వుంది. అరుదైన మైకా ఖనిజ సంపద వెంకటగిరిలో లభ్యమవుతుండడంతో ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నియోజకవర్గంలోని రాపూరు మండలంలో ఉంది.

అంతటి విశిష్టత కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ఎందరో ఉద్దండులు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు, సీఎంగా పనిచేసిన చరిత్ర ఉంది. అయితే  ఇప్పుడు అక్కడ పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. కృష్ణపట్నం ఓబులవారిపల్లి రైల్వే పనులు చేసిన కాంట్రాక్టర్‌ నుంచి రూ.కోట్లు డిమాండ్‌ చేయడం, వారు నిరాకరించడంతో తన అనుచరులతో పనులు అడ్డగించడం, కాంట్రాక్టర్లను కమీషన్‌ డిమాండ్‌కు సంబంధించి ఆడియో టేపులు లీకై రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది.

అయినా వెంకటగిరి నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లు నియంత్రత్వ పోకడతో వ్యవహరించినా పార్టీ అధిష్టానం ఆయన్ను చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక  టీడీపీలో  కనీస గౌరవం దక్కక వివాద రహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్‌ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద సైతం ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం గమనార్హం.

Image may contain: 5 people, people smiling, people standing and outdoor

సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురించాయి. వెంకటగిరి నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో మౌలిక వసతులు కోసం ఆనం రామనారాయణరెడ్డి ప్రకటిస్తున్న సమగ్ర ప్రణాళికపై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుండడంతో ఈ దఫా ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లా అంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 21 వార్డుల్లో టీడీపీకి పట్టం కట్టారు. ఈ విజయాల పరంపర వెనుక  వెంకటగిరి రాజాల కృషి ఉందనేది నిర్విదాంశం. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కక రాజా కుటుంబీకులు వైస్సార్‌సీపీలో చేరడంతో ఈసారి టీడీపీకి పరాభవం తప్పదంటున్నారు. . 2014 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధి కురుగొండ్ల   రామకృష్ణ 83,669 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్ధి వైఎస్సార్‌సీపీ నేత కొమ్మి  లక్ష్మయ్యనాయుడు 78,034 ఓట్లు సాధించి గట్టిపోటీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్ధికి కేవలం 5,635 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈసారి 20 వేల మెజారిటీతో గెలవాలని ఆనం పట్టుదలతో వున్నారు.

పసుపు కుంకుమ చెక్కుల పేరుతో చంద్రబాబు నాయుడు జనాన్ని మోసం చేస్తున్నారని వెంకటగిరి వైసిపి అభ్యర్ధి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని మాఫీ చేస్తానని చంద్రబాబు మరో నాటకానికి తెర తీశారని ఎద్దేవా చేశారు ఆనం. 

అందుకు తగ్గట్టుగా నియోజకవర్గంలోని ప్రతి సమస్యను ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లోకేష్‌కి మినహా వేరెవరికి ఉద్యోగం రాలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఆనం కోరారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని అందరి జీవితాల్లో ఆనందం వస్తుందని చెప్పారు. చంద్రబాబు పాలనలో రైతులు యువతీ యువకులు ఉద్యోగులు అన్ని వర్గాల వారు మోసపోయారని తెలిపారు. నలభై సంవత్సరాల చంద్రబాబు రాజకీయ అనుభవం 40 ఏళ్ల జగన్ వయసు ముందు తేలిపోయిందని ఆరోపించారు. మొత్తం మీద వెంకటగిరి సంస్థానంపై ఆనం తనదైన ముద్రవేయాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle