వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి ఘన విజయం
23-05-201923-05-2019 18:48:04 IST
Updated On 23-05-2019 18:54:30 ISTUpdated On 23-05-20192019-05-23T13:18:04.567Z23-05-2019 2019-05-23T13:18:02.810Z - 2019-05-23T13:24:30.378Z - 23-05-2019

ఏపీ ఎన్నికల్లో హాట్ సీట్‌గా మారిన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం రామనారాయణరెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని టీడీపీ సర్వప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరైంది. టికెట్ కేటాయించిన నాటినుంచి ఆనం నియోజకవర్గంపై పట్టుకోసం ప్రయత్నించారు. ప్రచారంలో ఆయన దూకుడు చూసిన వారంతా ఆయన గెలుపు నల్లేరుమీద బండి నడక అని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేతలు.
హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆనం రామనారాయణరెడ్డికి 38,577 ఓట్ల మెజారిటీ దక్కింది. ఆనం రామనారాయణరెడ్డికి మొత్తం 1,08,158 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్ధికి రామకృష్ణకు మొత్తం 69, 581 ఓట్లు పోలయ్యాయి. ఇంత భారీ మెజారిటీ లభిస్తుందని తాము ఊహించలేదని ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 20 నుంచి 25 వేల మెజారిటీ లభిస్తుందని ఆశించామని, తన పట్ల ఇంతటి ఆదరణ చూపించిన వెంకటగిరి ప్రజలకు రుణపడి ఉంటానని, వారికిచ్చిన ప్రతిహామీ నెరవెర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ‘న్యూస్ స్టింగ్’తో ఆయన సన్నిహితులు ఆనందం పంచుకున్నారు.
తన విజయంలో మరో రికార్డు కూడా ఆనం రామనారాయణరెడ్డి స్వంతం చేసుకున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధులలో అత్యధిక మెజారిటీ సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డిని అభినందించారు వైసీపీ నేతలు.
రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం కావడంతో టీడీపీ కూడా సర్వశక్తులు ఒడ్డింది. ఈ నియోజకవర్గంలో మొదటినుంచీ ఆనం ఆధిక్యం కనబరిచారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలు ఆయనకు మైనస్ అయ్యాయని భావిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లు నియంత్రత్వ పోకడతో వ్యవహరించినా పార్టీ అధిష్టానం ఆయన్ను చూసీ చూడనట్లు వదిలేయడంతో ఓటర్లు వైసీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు.
వివాద రహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సైతం ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరడం, వైసీపీ అభ్యర్ధికి సహకారం అందించారు. ప్రతి రోజూ ప్రతి వాడా ఆనం రామనారాయణరెడ్డితో కలిసి తిరిగారు. ప్రజలతో మమేకం అయ్యారు. వైసీపీ నవరత్నాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఆనం విజయం గురించి ముందే జోస్యం చెప్పింది న్యూస్ స్టింగ్.ఆ కథనం మీకోసం అందిస్తున్నాం.
వెంకటగిరి.... గురి ఎవరిది?

టీడీపీ కార్యాలయాన్ని.. కూల్చేయాల్సిందేనా!
2 hours ago

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ..!
3 hours ago

కలెక్టర్‌పై బదిలీవేటు! మంత్రితో తేడాలే కారణమా?
3 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శనలో విజయమ్మ, భారతి సందడి
3 hours ago

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!
4 hours ago

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
7 hours ago

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
10 hours ago

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
10 hours ago

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
10 hours ago

ఉల్లికి తోడు పాల ధరలకు రెక్కలు
11 hours ago
ఇంకా