newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

వీర శివారెడ్డికి ఝ‌ల‌క్‌..!

13-08-201913-08-2019 17:36:07 IST
Updated On 13-08-2019 17:45:48 ISTUpdated On 13-08-20192019-08-13T12:06:07.487Z13-08-2019 2019-08-13T12:06:02.196Z - 2019-08-13T12:15:48.106Z - 13-08-2019

వీర శివారెడ్డికి ఝ‌ల‌క్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పొలిటిక‌ల్ సీనియ‌ర్ నేత వీర శివారెడ్డికి అనుకోని రీతిలో ఝ‌ల‌క్ ఎదురైంది. అయితే ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు త‌న అనుచ‌ర‌గ‌ణంతో సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌ సీఎం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం సైతం తీవ్రంగా ప్ర‌య‌త్నించారు కూడా. ఇలా చంద్ర‌బాబుకు దూర‌మై అధికార‌పార్టీలో చేరుదామ‌ని భావించిన వీర శివారెడ్డికి వైసీపీ నుంచే ఎదురుగాలి వీచింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేష‌ణ చేస్తున్నాయి. 

అంతేకాక జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో చేరి త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దుదామ‌ని భావించిన వీర శివారెడ్డి ఆశ‌లు అడియాశ‌లుగానే మిగిలిపోయాయంటూ పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు చెబుతున్నారు. ఇలా అధికార పార్టీ ఊహించ‌ని రీతిలో హ్యాండ్ ఇవ్వ‌డంతో వీర శివారెడ్డిలో ఒకింత ఆందోళ‌న మొద‌లైంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అదేంటి..?  ప్ర‌త్యర్ధులను సైతం అక్కున చేర్చుకునే సీఎం జ‌గ‌న్ వీర శివారెడ్డికి ఝ‌ల‌క్ ఇవ్వ‌డ‌మేంటి..? అన్న ప్ర‌శ్న‌కు అస‌లు స‌మాధానం ఇలా ఉంది. కాగా, ఈ నెల 3వ తేదీన క‌డ‌ప డీసీబీబీ చైర్మ‌న్‌గా ఉన్న అనీల్ కుమార్ రెడ్డి ప‌ద‌వీ కాలం ముగిసింది. దీంతో ప‌దవీ కాలం పొడిగింపు విష‌యంలో క‌లుగ‌జేసుకున్న వీర శివారెడ్డి ఎన్నిక‌ల గ‌డువు పూర్త‌య్యే వ‌ర‌కు త‌న కుమారుడిని కొన‌సాగించ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ఇదంతా కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం.. అందులో భాగంగా త‌న‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తుంద‌ని వీర శివారెడ్డి భావించి ఉండొచ్చ‌ని ప‌లువురు చెబుతున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం వీర శివారెడ్డి కుమారుడు అనీల్ కుమార్‌రెడ్డిని డీసీబీబీ చైర్మ‌న్‌గా కొన‌సాగించేదుకు ఎట్టి ప‌రిస్థితిలో అంగీక‌రించేది లేదంటూ తేల్చిచెప్పింది. ఇలా కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ తీర్చిదిద్ద‌డంలో భాగంగా వైసీపీకి మ‌ద్దతు తెలిపిన వీర శివారెడ్డికి అనుకోని రీతిలో ఝ‌ల‌క్ ఎదురైంది. ఇలా కుమారుడితోపాటు తండ్రి రాజ‌కీయ భ‌విష్య‌త్ కూడా ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

మ‌రోప‌క్క‌, వీర శివారెడ్డి మేట‌ర్‌పై దృష్టిసారించిన ప‌లువురు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఝ‌ల‌క్ ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణాల‌ను స్ప‌ష్టంగా చెప్పుకొస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో క‌డ‌ప డీసీబీబీ చైర్మ‌న్‌గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌ తిరుపాల్‌రెడ్డి ప్లేస్‌లో అనీల్‌కుమార్‌రెడ్డిని రీప్లేస్ చేశారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది క‌నుక ప‌ని సులువుగా ముగిసింద‌నుకోవ‌చ్చు. అలానే నేడు తాను టీడీపీకి రాజీనామా, వైసీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వ‌స్తున్న నేప‌థ్యంలో త‌న కుమారుడి ప‌ద‌వి గ‌డువు కాలం ముగిసినా కొన‌సాగింపు వెరీ సింపుల్ అవుతుంద‌ని వీర శివారెడ్డి భావించారు. ఇలా నాడు వైసీపీ నేత‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంలో కీ రోల్ పోషించార‌న్న విష‌యాన్ని పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు చెబుతున్నారు.

మొద‌టి కార‌ణం అలా ఉంటే.., రెండో కార‌ణం ఇలా ఉంది.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న సొంత గ్రామ‌మైన కోగ‌టంలో వైసీపీ త‌రుపున వీర శివారెడ్డి ప్ర‌చారం చేసినా.. టీడీపీనే 600 ఓట్ల మెజార్టీ సాధించింది. ఇలా సొంత గ్రామంలోనే ఎటువంటి ప్ర‌భావం చూప‌లేక‌పోయిన వీర శివారెడ్డిపై పార్టీ దృష్టి కాస్త త‌గ్గింద‌ని, ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఊహించిన రీతిలో ఎటువంటి ప్రాధాన్య‌త ఇచ్చేది లేద‌న్న విష‌యం వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యం వేదిక‌గా వినిపిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle