newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

'వీరవాహన్ ఉద్యోగ్'కి ఏపీసర్కార్ 120 ఎకరాల కేటాయింపు.. ఏంటి సంగతి?

23-11-201923-11-2019 09:22:56 IST
2019-11-23T03:52:56.889Z23-11-2019 2019-11-23T03:52:49.470Z - - 05-08-2020

'వీరవాహన్ ఉద్యోగ్'కి ఏపీసర్కార్ 120 ఎకరాల కేటాయింపు.. ఏంటి సంగతి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ నుండి పెట్టుబడుల సంస్థలు, కంపెనీలు వెనక్కు క్యూ కడుతున్నాయి. గత ఐదు నెలలుగా ఇలాంటి కథనాలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తున్నా వెళ్ళేవాళ్ళు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యారన్న అధికారిక వార్తలతో ఏపీ నుండి తెగదెంపులు చేసుకున్న మాట వస్తావేమోనని సగటు ప్రజలకు అర్ధమైపోతుంది.

ఇందులో సింగపూర్ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వమే వెళ్లిపోవాలని కోరడంతో కన్సార్టియం అధికారికంగానే ఏపీకి గుడ్ బై చెప్పేసింది. రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వంలో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక అదానీ గ్రూప్ గత ప్రభుత్వంలోనే డెబ్భై వేల కోట్లు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంది. అది కూడా ఇప్పుడు రాష్ట్రాన్ని కాదని తెలంగాణకు షిఫ్ట్ అయింది.

విశాఖలో ప్రపంచస్థాయి మాల్ కోసం ముందుకొచ్చిన లులూ సంస్థ ఇప్పుడు తమవల్ల కాదని తేల్చిచెప్పేసింది. ఇక తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ చిప్స్, సెటప్ బాక్సులు తయారుచేసేందుకు సంస్థను ఏర్పాటు చేసేందుకు గత సీఎం చంద్రబాబు అంబానీ జియో సంస్థ ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకు ఆ ప్రభుత్వం భూమిని కేటాయించినా ఇప్పుడు ఆ భూమి కేటాయింపు రద్దు చేసి మరోచోట వివాదంలో ఉన్న భూమి కేటాయింపుతో అంబానీ కూడా చేతులెత్తేశారు.

అదంతా రాష్ట్రం నుండి వెళ్లిపోయిన సంస్థల వ్యవహారం కాగా నిన్నటికి నిన్న ఏపీలో ఓ సంస్థకు ప్రభుత్వం ఏకంగా 120 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో పాటు మరికొన్ని రాయితీలను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. అదే వీరవాహన్ ఉద్యోగ్ సంస్థ. మొత్తం వెయ్యి కోట్ల పెట్టుబడులతో అనంతపురం జిల్లా గూడవల్లి అనే గ్రామంలో ఎలక్ట్రిక్ బస్సులను తయారుచేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది.

ఇందుకుగాను ఏపీ ప్రభుత్వం ఈ సంస్థ కోసం ఎకరం ఆరులక్షల చొప్పున 120 ఎకరాలను కేటాయించింది. ఈ ఒప్పందం-కేటాయింపులతో రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలు ఒక్కసారిగా అవాక్కయినట్లుగా తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే కోగటం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ సంస్థ ఇప్పటివరకు బెంగళూరులో బస్సు బాడీ బిల్డింగ్ మాత్రమే చేసింది. కంపెనీ టర్నోవర్ కూడా జస్ట్ రూ 85 కోట్లు మాత్రమే.

వీరవాహన్ ఉద్యోగ్ సంస్థ మొత్తం నెట్ వర్త్ కూడా రూ 125 కోట్లు. ఇప్పటివరకు బస్సు తయారీలో ఎలాంటి అనుభవం లేని చిన్న ఇంజనీరింగ్ సంస్థ ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ బస్సులను తయారుచేసేందుకు ముందుకు రావడం.. దానికి ప్రభుత్వం కూడా కోట్ల విలువైన భూములను కేవలం లక్షలకు కట్టబెట్టడం ఏమిటా అంటూ పారిశ్రామిక వేత్తలు నోరెళ్ళ బెడుతున్నారు.

ఒక చిన్న సంస్థ అది కూడా సొంత రాష్ట్రంతో అనుబంధం ఉన్న సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభపరిణామమే. అయితే గతంలో వైఎస్ హయాంలో లేపాక్షి సంస్థకు ఇలానే భూకేటాయింపులు చేయగా బ్యాంకులలో తనఖా పెట్టి భారీగా సొమ్ముచేసుకుని చేతులెత్తేసిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. అసలు ఇంతకీ అశోక్ లేలాండ్ లాంటి పెద్ద కంపెనీలే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ-అమ్మకంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో వీరవాహన్ సంస్థ ఇంత గొప్ప స్టెప్ వేయడం వెనుక అసలు రహస్యమేంటన్నది ఆసక్తికరంగా మారింది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle