newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

‘వీఐపీలు ఏడాదికి ఒక్కసారే తిరుమల రావాలి’

14-07-201914-07-2019 09:15:31 IST
Updated On 15-07-2019 11:55:55 ISTUpdated On 15-07-20192019-07-14T03:45:31.108Z14-07-2019 2019-07-14T03:45:15.376Z - 2019-07-15T06:25:55.579Z - 15-07-2019

‘వీఐపీలు ఏడాదికి ఒక్కసారే తిరుమల రావాలి’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కే కాకుండా అన్ని రాష్ట్రాల వారికి ఎంతో ప్రీతి. పూరిగుడిసెలో ఉండే నిరుపేద నుంచి కోట్ల‌కు అధిప‌తుల వారికి అంద‌రికీ వెంకన్న ఇష్ట‌దైవం. అయితే, భ‌గ‌వంతుడి ముందు అంద‌రూ స‌మాన‌మే అనేది పురాణాల‌తో పాటు కోర్టులు కూడా చెబుతున్నాయి. కానీ, తిరుమ‌ల‌లో మాత్రం ఇంత‌కాలం ఈ ప‌రిస్థితి లేదు. 

తిరుమ‌ల‌లో వీఐపీలకు ఎప్పుడూ పెద్ద‌పీట ఉండేది. వీఐపీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో స్వామి వారిని ద‌ర్శించుకునే సౌల‌భ్యం ఉండేది. అదే, పేద‌లు మాత్రం శ్రీవారిని ద‌ర్శించుకోవాలంటే గంట‌ల త‌ర‌బ‌డి, ఒక్కోసారి రోజుల త‌ర‌బ‌డి లైన్ల‌లో ఉండాలి. సామాన్య భ‌క్తులు త‌మ జీవిత‌కాలం రెండుమూడు సార్లు కూడా శ్రీవారి స‌న్నిధికి వెళ్ల‌డం క‌ష్టం కాగా వీఐపీలు మాత్రం ఏడాదికి నాలుగైదు సార్లు వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శించుకుంటున్నారు.

ఇలా వ‌చ్చే వీఐపీల‌కు స్థాయిని బ‌ట్టి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 కోటాలో ప్ర‌త్యేక బ్రేక్‌ ద‌ర్శ‌నాలు చేయించే వారు. ఎంత ర‌ద్దీ ఉన్నా వీఐపీల‌కు మాత్రం స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. కేవ‌లం వీరి కోస‌మే ప్ర‌త్యేకంగా నాలుగు గంటలు కేటాయిస్తున్నారు.

ఈ స‌మ‌యంలో సామాన్యుల ద‌ర్శ‌నాలు నిలిపివేస్తారు. ప్ర‌తీరోజూ ఇలా వైఐపీలే సుమారు 6 - 8 వేల మంది శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే వారు. ఈ నాలుగు గంట‌ల స‌మ‌యం సామాన్య భ‌క్తుల‌కు ఇస్తే సుమారు 30 - 40 వేల మంది ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇప్పుడు తిరుమ‌ల‌లో వీఐపీ విధానానికి తిరుమ‌ల‌లో స్వ‌స్థి ప‌లికేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  వీఐపీల దర్శనాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనానికి రావాలని ఆయన సూచించారు. పదే పదే వీఐపీలు దర్శనానికి వస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. శ్రీవారి దర్శనం విషయంలో వినూత్న మార్పులు తెస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించారు. భ‌గ‌వంతుడి ముందు అంద‌రూ స‌మాన‌మేన‌ని సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేసి వారికి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ద‌ర్శ‌నం చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించేందుకు టీటీడీ క‌స‌ర‌త్తు చేస్తోంది.

వీఐపీల తాకిడికి చెక్ పెట్టేందుకు మ‌రో సూచ‌న‌ను కూడా టీటీడీ చేస్తోంది. వీఐపీలు ఏడాదికి ఒకేసారి తిరుమ‌ల రావాల్సిందిగా టీటీడీ కోరుతోంది. ఇంత‌కుముందులా సిఫార్సు లేఖ‌ల‌తో వ‌చ్చే వారికి కాకుండా ప్రోటోకాల్ ఉన్న వీఐపీల‌కు మాత్ర‌మే ఇక నుంచి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించేలా టీటీడీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇదే జ‌రిగితే మాత్రం నిజంగా శ్రీవారి భ‌క్తులంద‌రికీ శుభవార్తే అవుతుంది. 

అయితే, గ‌త ప్ర‌భుత్వాలు సైతం తిరుమ‌ల‌లో వీఐపీ ట్రీమ్‌మెంట్‌కు చెక్ పెట్టేందుకు ఎంతో కొంత ప్ర‌య‌త్నించాయి. కానీ, వివిధ ఒత్తిళ్ల వ‌ల్ల ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. మ‌రి, ఇప్పుడు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లించి సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట ద‌క్కుతుందో చూడాలి.ఇంతవరకూ బాగానే వుంది.మరి.. తిరుమల తరచూ వచ్చే రెండురాష్ట్రాలకు చెందిన ఆ వీవీఐపీకి కూడా ఈ రూల్ వర్తింపచేస్తారా సుబ్బారెడ్డి గారూ!

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle