newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

విహారయాత్రల్లో లీడర్లు.. టెన్షన్లో కార్యకర్తలు

18-04-201918-04-2019 09:38:38 IST
Updated On 18-04-2019 18:00:55 ISTUpdated On 18-04-20192019-04-18T04:08:38.189Z18-04-2019 2019-04-18T04:08:31.626Z - 2019-04-18T12:30:55.277Z - 18-04-2019

విహారయాత్రల్లో లీడర్లు.. టెన్షన్లో కార్యకర్తలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘తాంబూలిచ్చాం... తన్నుకు చావండి’ అన్నట్టుగా తయారైంది రాజకీయనేతల పరిస్థితి. ఈసీ నేతలకు అగ్నిపరీక్ష పెట్టింది. ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక ఫలితాలే మిగిలాయి. కానీ అవి కనుచూపుమేరలో లేవు. దీంతో నేతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. దాదాపు ఇంకా నెలరోజులు పైగానే సమయం ఉండడంతో నేతలు విహారయాత్రలకు వెళుతున్నారు. అందునా సమ్మర్ కూడా కలిసి రావడంతో వారు రిలాక్స్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ఆశలు వున్నవారు ఫ్యామిలీ టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లినా వారిలో మాత్రం టెన్షన్ మాత్రం పెరుగుతూనే ఉంది. 

ఇదిగో ఏపి ఇంటలిజెన్స్ సర్వే. అదిగో టీడీపీ సర్వే.. తాజాగా వచ్చిన వైసీపీ సర్వే ఇదిగో అంటూ సోషల్ మీడియా ద్వారా వస్తున్న నివేదికలు అభ్యర్థులకు బీపీని పెంచుతున్నాయి. దాంతో వారంతా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ కనిపించిన దేవుడిని గెలిపించాలని ప్రార్థిస్తున్నారు. కొందరైతే చండి హోమాలు, పూజలు జరిపిస్తున్నారు. ఓటరు దేవుడు కరుణ తమపై ఉండేలా చూడాలని మొక్కులు మొక్కుతున్నారు. కొందరు అభ్యర్థులు వేసవి తాపం వంట్లో పెరుగుతున్న వత్తిడి తట్టుకునేందుకు కులుమనాలి, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసుకున్నారు. 

పది పదిహేనురోజులు ఎక్కడికైనా వెళితే టెన్షన్ తగ్గుతుందన్న యోచనలో ఉన్నారు నేతలు. నియోజకవర్గాల్లో ఉంటే లేనిపోని టెన్షన్స్ తప్ప ఏముంటాయి అని మరికొందరి అభిప్రాయం. ఎన్నికల్లో చేసిన అప్పులోళ్లనుంచి తప్పించుకునేందుకు కూడా మంచి ఉపాయంగా వారికి తోస్తోంది. లీడర్లు ఇలా టూర్లలో ఖుషీగా ఉంటే వారి క్యాడర్ మాత్రం టెన్షన్ పడుతోంది. త్వరగా ఎన్నికలు నిర్వహించిన ఈసీపై వారు మండిపడుతున్నారు.   


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle