newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విసారెడ్డిపై బుడ్డా వెంకన్న స్ట్రాంగ్ కామెంట్స్

11-11-201911-11-2019 14:54:51 IST
2019-11-11T09:24:51.796Z11-11-2019 2019-11-11T09:24:48.201Z - - 08-07-2020

విసారెడ్డిపై బుడ్డా వెంకన్న స్ట్రాంగ్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇద్దరు నేతలు తరచూ ట్విట్టర్ వేదికగా ఒకరిమీద ఒకరు వ్యంగ్య బాణాలు వేసుకుంటుంటారు. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న ఒకరైతే.. వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా ఈ ఇద్దరు నేతలు ట్వీట్లతో అగ్గి రాజేస్తున్నారు. విసారెడ్డి, జగన్ లపై స్ట్రాంగ్ కామెంట్లు చేశారు వెంకన్న. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధి వలనే జగన్, మీరు ఇలా అయిపోయారని వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

అబద్దాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలని జగన్, విజయసాయిరెడ్డికి ఈ లక్షణాలు బాగా వున్నాయన్నారు. డెంగ్యూతో ప్రజలు ఛస్తుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జోకులు వెయ్యడం, 45 ఏళ్లకే పెన్షన్ అని మహిళలను మోసం చెయ్యడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, సొంత వారిని లేపేయడం అన్ని వ్యాధి లక్షణాలే అన్నారు. ఈ వ్యాధి వల్ల వాళ్లు మాత్రం ఏమి చేస్తారు పాపం అంటూ ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

రెండురోజుల నుంచి బుడ్డా వెంకన్న ట్విట్టర్లో అవుటర్ రింగ్ రోడ్డులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ చేసిన అవినీతి గురించి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తలపెట్టిన హైదరాబాద్ రింగు రోడ్డుని వంకర  రోడ్డుగా మార్చింది మీ మహామేత. రింగు రోడ్డుని అష్ట వంకర్లు తిప్పి మీ మహామేత, యువమేత మందీ మార్బలంతో కలిసి ప్రాజెక్టు వ్యయాన్ని 5500 కోట్ల నుండి 35 వేల కోట్లకు మార్చి ఆస్తులు కూడబెట్టిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు హయాంలో చేసిన అప్పు రూ.1,10,000 కోట్లు అంటే ఏడాదికి 22 వేల కోట్లు. ఐదు నెలల మీ  జగన్ పాలనలో చేసినవి 18 వేల కోట్లు. పైగా 2019-2020 బడ్జెట్లో సంవత్సరానికి 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించారు అంటూ అప్పుల చిట్టా విప్పారు వెంకన్న. మొత్తం మీద ఏపీలో ట్వీట్ల వార్ బాగానే సాగుతోంది. జనం మాత్రం వీరి ట్వీట్లు చూసి విస్తుపోతున్నారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle