newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్‌ హఠాన్మరణం

09-12-201909-12-2019 12:14:29 IST
Updated On 09-12-2019 12:14:27 ISTUpdated On 09-12-20192019-12-09T06:44:29.364Z09-12-2019 2019-12-09T06:43:45.444Z - 2019-12-09T06:44:27.507Z - 09-12-2019

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్‌ హఠాన్మరణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జయరాజ్‌ ఆకస్మికంగా మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి అనంతపురం నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు జయరాజ్. కర్నూలు జిల్లా డోన్‌ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన బస్సులోనే కుప్పకూలారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు అప్రమత్తమై.. సత్వరమే డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన అప్పటికే ప్రాణాలు వదిలినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆయన తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు విశ్వవిద్యాలయంపై పట్టు ఉంది. మంచి పాలనానుభవం ఆయన సొంతం. ఆచార్య జయరాజ్‌కు బోధన, పరిశోధన, పరిపాలన రంగంలో 31 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

1987లో ఎస్కేయూలో అధ్యాపకునిగా చేరిన ఆయన ఆర్థిక శాస్త్ర విభాగం అధిపతిగా, డీన్‌ సోషియల్‌ సైన్సెస్‌గా, రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్‌గా, ఎస్కేయూ ఉపప్రధానాచార్యులుగా, ప్రధానాచార్యులుగా, కళాశాల అభివృద్ధి డీన్‌గా, డీన్‌ స్టూడెంట్స్‌ అఫైర్స్‌గా, సోషియల్‌ ఎక్స్‌క్లూజివ్‌ సంచాలకులుగా వివిధ హోదాల్లో పని చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. 2012లో రాష్ట్ర ఉత్తమ ఆచార్య అవార్డు అందుకున్నారు. ఎస్కేయూ ఉపకులపతిగా అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం పట్ల విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయనేతలు సంతాపం తెలుపుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle