newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

విశాఖ ముఖచిత్రం.. ఈసారి ఏకపక్షం కాదట!

18-05-201918-05-2019 15:09:23 IST
2019-05-18T09:39:23.558Z18-05-2019 2019-05-18T09:39:17.842Z - - 26-06-2019

విశాఖ ముఖచిత్రం.. ఈసారి ఏకపక్షం కాదట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైన జిల్లాల్లో విశాఖ‌ప‌ట్నం ఒక‌టి. ఆ ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ హ‌వా వీచింది. జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో వైసీపీ కేవ‌లం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు మాత్ర‌మే గెల‌వ‌గా తెలుగుదేశం పార్టీ 11 స్థానాలు, వారి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ ఒక స్థానం గెలిచింది. అప్పటి ఎన్నిక‌ల్లో జిల్లా మొత్తం టీడీపీ గుత్తాధిపత్యం కనిపించింది. బీజేపీతో పొత్తు, అర్బన్ ఓట్లు టీడీపీ వైపు మొగ్గు చూప‌డం ఆ పార్టీకి క‌లిసివ‌చ్చింది.

వైసీపీ జిల్లాపై అనేక ఆశ‌లు పెట్టుకున్నా విఫ‌ల‌మైంది. స్వయంగా ఆ పార్టీ గౌర‌వాధ్యక్షురాలు, జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ సైతం విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లోనైనా జిల్లాలో ఎక్కువ స్థానాలు ద‌క్కించుకోవాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయ‌త్నించింది. ఇక‌, త‌మ‌కు ప‌ట్టున్న జిల్లా అయినందున మ‌రోసారి ఇక్కడ స‌త్తా చాటాల‌ని తెలుగుదేశం పార్టీ ప‌ట్టుద‌ల‌గా ఉంది. అయితే, పోలింగ్ స‌ర‌ళి త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల మాదిరిగి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు ఉండే అవ‌కాశం లేవ‌నే అంచ‌నాలు ఏర్పడ్డాయి.

Image result for visakhapatnam board

ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నం రూర‌ల్ ఏరియాలో వైసీపీ బాగా పుంజుకున్నట్లు క‌నిపించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గెలుచుకున్న అర‌కు, పాడేరు, మాడుగుల‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి మ‌రోసారి గెలుపు అవ‌కాశాలు ఉన్నాయి. గిరిజ‌నుల్లో వైఎస్ పై అభిమానం ఉండ‌టం ఆ పార్టీకి క‌లిసిరావ‌చ్చు. అర‌కులో టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవ‌ణ్ పై కొంత సానుభూతి క‌నిపిస్తున్నా ఆయ‌న గెలుపు మాత్రం అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

రూర‌ల్‌లోని చోడ‌వ‌రం, న‌ర్సీప‌ట్నం, పాయ‌క‌రావుపేట‌, పెందుర్తి, య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల కంటే వైసీపీ కొంత మేర పుంజుకుంది. టీడీపీ సిట్టింగ్ స్థానాలైన ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈసారి వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. క‌నీసం వీటిల్లో 2 లేదా 3 స్థానాల‌ను ఆ పార్టీ గెలిచే అవ‌కాశం ఉంది.

ఇక‌, అర్బన్ ప్రాంతంలో మ‌రోసారి తెలుగుదేశం పార్టీ వేవ్ క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అర్బన్ ఏరియాలో గెలిచిన సీట్లలో టీడీపీ ముందుంది. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలోని నాలుగు స్థానాల్లో మూడు టీడీపీ గెలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఒక్క స్థానం మాత్రం వైసీపీ ఖాతాలో ప‌డ‌వ‌చ్చు. ఇక‌, అర్బన్ ఏరియానే అయినా భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. గాజువాకలో జ‌న‌సేన గెల‌వ‌వ‌చ్చు. మొత్తంగా విశాఖ‌ప‌ట్నం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లా ఏక‌ప‌క్ష ఫ‌లితాలు ఈసారి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువే. ఒక‌టిరెండు స్థానాలు అటుఇటుగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు స‌మానంగా సీట్లు గెలిచే అవ‌కాశం ఉంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle