newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

విశాఖ తూర్పులో వైసీపీ గెలిచేనా?

23-03-201923-03-2019 09:14:13 IST
Updated On 23-03-2019 09:14:26 ISTUpdated On 23-03-20192019-03-23T03:44:13.093Z23-03-2019 2019-03-23T03:44:06.330Z - 2019-03-23T03:44:26.899Z - 23-03-2019

విశాఖ తూర్పులో వైసీపీ గెలిచేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన వ్యూహం వైసీపీని దెబ్బతీసే విధంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది. వరుసగా ఆ పార్టీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు ఈ సీటులో గెలిచారు. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు తక్కువగా ఉన్నా, టీడీపీకి ఉన్న బలమైన ఓట్ బ్యాంకుతో గెలుస్తూ వచ్చారు రామకృష్ణ.

ఇక టిక్కెట్ విషయంలో మల్లగుల్లాలు పడ్డ వైసీపీ నేతలు, మొదట్లో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారు. కానీ జగన్ జోక్యంతో అంతా సర్దుకున్నారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్కరమాని  నిర్మలకు టిక్కెట్ ఇచ్చారు జగన్. ఈ సామాజిక సమీకరణంతో వైసీపీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు భావించారు.

కానీ జనసేన పార్టీ తన అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత విశాఖ తూర్పు రాజకీయ చిత్రం మారిపోయిందట. ఎందుకంటే యాదవ సామాజికవర్గానికే చెందిన కోన తాతారావును బరిలో దింపారు పవన్ కల్యాణ్. విశాఖ తూర్పులో యాదవులతో పాటు కాపులు, బీసీలు, ఎస్సీల ఓట్ బ్యాంకు కూడా బలంగా ఉంది. అంటే యాదవుల ఓట్లు చీలి, కాపుల ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయన్నది వైసీపీ అంచనా.

ఇదే జరిగితే మిగిలిన కులాల ఓట్లను అటు టీడీపీ, ఇటు వైసీపీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మెజార్టీ తక్కువైనా జనసేన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయట. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలు విజయం మీద అనుమాన పడుతున్నారట.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle