newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

విశాఖ టీడీపీలో రాజ‌ధాని రగ‌డ‌..! బాబుకు ఎమ్మెల్యేల షాక్‌..?

04-08-202004-08-2020 08:57:17 IST
Updated On 04-08-2020 09:09:21 ISTUpdated On 04-08-20202020-08-04T03:27:17.977Z04-08-2020 2020-08-04T03:26:31.399Z - 2020-08-04T03:39:21.552Z - 04-08-2020

విశాఖ టీడీపీలో రాజ‌ధాని రగ‌డ‌..! బాబుకు ఎమ్మెల్యేల షాక్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ ర‌గ‌డ‌కు కార‌ణం కాగా తెలుగుదేశం పార్టీలోనూ అంత‌ర్గ‌త పోరుకు కార‌ణ‌మ‌వుతోంది. ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌లు పార్టీ లైన్ దాటుతున్నారు.

ఒక‌వైపు అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధానిగా ఉండాల‌ని, మూడు రాజ‌ధానుల‌ను ఒప్పుకునే స‌మ‌స్యే లేదని చంద్ర‌బాబు నాయుడు అంటుండ‌గా విశాఖ‌ప‌ట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం తెలుగుదేశం పార్టీలోనూ విబేధాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అని చెబుతున్నా అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని విశాఖ‌ప‌ట్నానికి త‌ర‌లిస్తున్నార‌నే భావ‌న‌నే అంద‌రిలోనూ ఉంది. అమ‌రావ‌తికి పెట్టాల్సిన ఖ‌ర్చులో 10 శాతం పెడితే విశాఖ‌ప‌ట్నం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై వంటి న‌గ‌రాల‌తో పోటీ ప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హా వైసీపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్నారు. అంటే, విశాఖ‌ప‌ట్నాన్ని అభివృద్ధి చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, మూడు రాజ‌ధానుల విషయానికి వ‌చ్చినా పాల‌న ఎక్క‌డి నుంచి కొన‌సాగుతుందో అదే కీల‌కం అవుతుంది.

విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా జ‌గ‌న్ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. అమ‌రావ‌తిలో కేవ‌లం అసెంబ్లీ మాత్ర‌మే ఉంటుంది. ఆరు నెల‌లకు ఒక‌సారి అసెంబ్లీ స‌మావేశాల‌కు అమ‌రావ‌తి వేదిక అవుతుంది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం, రాజ్ భ‌వ‌న్, స‌చివాల‌యం వంటి కీల‌క వ్య‌వ‌స్థ‌లు మొత్తం విశాఖ‌ప‌ట్నానికి వెళ్ల‌నున్నాయి. ఇప్ప‌టికే విశాఖ‌ప‌ట్నంలో మెట్రో వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క స‌దుపాయ‌ల క‌ల్ప‌న దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తికి బ‌దులు విశాఖ‌ప‌ట్నాన్ని అభివృద్ధి చేయాల‌నే ప్ర‌భుత్వ ఆలోచ‌న స్ప‌ష్ట‌మ‌వుతోంది.

జ‌న‌వ‌రిలో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేయ‌గానే విశాఖ‌ప‌ట్నం టీడీపీలో భిన్న వాద‌న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. మొద‌ట విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలోని న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ప‌లువురు కీల‌క నేత‌లు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించాయి.

అయితే, చంద్ర‌బాబు నాయుడు ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్యతిరేకించ‌డంతో వీరంతా త‌ట‌స్థంగా ఉండిపోయారు. దీంతో విశాఖ‌ప‌ట్నం ప్ర‌జ‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే విశాఖ‌ను రాజ‌ధానిని చేయ‌డానికి స‌హ‌క‌రించ‌డం లేద‌నే భావ‌న వ‌స్తోంది. త‌మ పార్టీకి ప‌ట్టున్న న‌గ‌రంలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తే ఎలా అని భ‌విష్య‌త్‌పై విశాఖ టీడీపీ నేత‌ల్లో బెంగ మొద‌లైంది.

ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల బిల్లును ఆమోదించ‌గానే విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ బాహాటంగానే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. పార్టీ ఈ విష‌యంపై వ్య‌తిరేకంగా ఉన్నా ఆయ‌న మాత్రం సానుకూలంగా స్పందించారు. మిగ‌తా ముగ్గురు న‌గ‌ర ఎమ్మెల్యేలు ఈ విష‌యంలో పెద‌వి విప్ప‌డం లేదు. పార్టీ లైన్ ప్ర‌కారం మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా మాట్లాడితే విశాఖ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంది. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయ‌డాన్ని స‌మ‌ర్థిస్తే చంద్ర‌బాబుకు కోపం వ‌స్తుంది.

ఈ నేప‌థ్యంలో వారు సైలెంట్‌గా ఉండ‌డ‌మే మంచిద‌నే భావ‌న‌లో ఉన్నారు. అయితే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాత్రం విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయ‌డాన్ని ముందు నుంచీ స‌మ‌ర్థిస్తున్నారు.

ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఉండ‌గా రాజ‌ధానుల వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని కాకుండా వ్య‌తిరేకిస్తున్న టీడీపీ వైఖ‌రిని విభేదిస్తూ ఆయ‌న ఆగ‌స్టు 8 లేదా 9వ తేదీన వైసీపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆయ‌న మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు పెద‌వి విప్ప‌డం లేదు.

 

 

 

 

 

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   2 minutes ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   2 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   2 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   2 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   2 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   2 hours ago


ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

   3 hours ago


దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

   4 hours ago


మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

   5 hours ago


స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

   6 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle