newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో జగన్.. ఏమన్నారంటే?

18-05-202018-05-2020 17:22:01 IST
Updated On 18-05-2020 17:38:06 ISTUpdated On 18-05-20202020-05-18T11:52:01.953Z18-05-2020 2020-05-18T11:51:49.010Z - 2020-05-18T12:08:06.470Z - 18-05-2020

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో జగన్.. ఏమన్నారంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన చాలా బాధాకరం అన్నారు సీఎం జగన్. ఇలాంటి ఘటనలు జరగకూడదు..ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఓఎన్జీసీ ప్రమాదంలో సంస్థ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి.

ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్‍తో పాటు 110 అంబులెన్స్ లు కూడా ఘటన స్థలికి చేరుకున్నాయి. హుటాహుటిన బాధితులను ఆస్పత్రులకు తరలించారన్నారు. రెండు గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారని, అధికారులు స్పందించిన తీరును అభినందిస్తున్నా అన్నారు జగన్.  

మంత్రులతో, అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేశాం అన్నారు సీఎం జగన్. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి 13 వేల టన్నుల స్టైరిన్‍ను రెండు షిప్‍ల ద్వారా వెనక్కి పంపించామన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు ఒక్క అనుమతి కూడా మనం అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి గాని, విస్తరణ గాని చంద్రబాబు అధికారంలోనే ఉన్నప్పుడే జరిగాయని వివరించారు. 

అయినా ఎక్కడా మనం రాజకీయ ఆరోపణలు చేయలేదని, మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని మాత్రమే ప్రయత్నించామన్నారు. 10 రోజుల్లోపే పరిహారంతో పాటు వైద్య సేవలను పూర్తిగ అందించామని, గ్రాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజల ఆందోళన చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతివ్యక్తికి రూ.10 వేలు ఆర్థికసాయం చేస్తామన్నారు. వెంటిలేటర్‍పై ఉన్నవారికి రూ.10 లక్షలు రెండ్రోజులకు పైగా ఆస్పత్రుల్లో ఉన్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించామన్నారు. 

కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరివల్ల జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడని, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వనన్నారు జగన్. గ్రామాల్లో ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఆదేశించానని, జలకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామని, ఆ పరిశ్రమలో అలాంటి ప్రక్రియ కొనసాగనివ్వం అందుకే స్టైరిన్ మొత్తం అక్కడి నుంచి తరలించామన్నారు.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   5 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   10 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   13 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   13 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   13 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   15 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   16 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   16 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   16 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle