newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

విశాఖ ఉత్స‌వ్ : మాట్లాడ‌కుండానే వెనుదిరిగిన సీఎం జ‌గ‌న్‌..!

29-12-201929-12-2019 08:33:19 IST
Updated On 31-12-2019 11:24:13 ISTUpdated On 31-12-20192019-12-29T03:03:19.455Z29-12-2019 2019-12-29T03:03:14.074Z - 2019-12-31T05:54:13.365Z - 31-12-2019

విశాఖ ఉత్స‌వ్ :  మాట్లాడ‌కుండానే వెనుదిరిగిన సీఎం జ‌గ‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జీఎన్ రావు, బీసీజీ నివేదిక‌ల ఆధారంగా సీఎం జ‌గ‌న్ విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంత వాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్ర‌క‌టన చేసిన కొద్ది రోజుల్లోనే శ‌నివారం నిర్వ‌హించిన విశాఖ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మం చాలా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే, కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డానికి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ స‌భ‌పై ఎటువంటి ప్ర‌సంగం చేయ‌కుండా వెనుదిర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది.

అంత‌కు ముందు సీఎం జ‌గ‌న్ విశాఖ‌కు చేరుకున్న సంద‌ర్భంలో ఎయిర్‌పోర్టు నుంచి స‌భ జ‌రిగిన ప్రాంగ‌ణం ఆర్‌కే బీచ్ వ‌ర‌కు ఆ ప్రాంత వాసులు మాన‌వ‌హారంతో స్వాగ‌తం ప‌లికారు. విశాఖ ఉత్స‌వ్‌ను ప్రారంభించిన జ‌గ‌న్ అనంత‌రం న‌వ‌ర‌త్నాల‌పై ప్ర‌ద‌ర్శించిన లేజ‌ర్ షోను తిల‌కించారు. ప‌లువురు ప్ర‌ముఖులు జ‌గ‌న్‌కు స‌న్మానం చేశారు. ఆ త‌రువాత జ‌గ‌న్ అక్క‌డ్నుంచి వెనుదిర‌గ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా ప్ర‌క‌టించిన త‌రువాత ఆ ప్రాంతంలో జ‌రిగిన మొట్ట‌మొద‌టి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌తార‌ని అంద‌రూ భావించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం న‌వ‌ర‌త్నాలను వివ‌రిస్తూ ఏర్పాటుచేసిన‌ లేజ‌ర్ షోను తిల‌కించి వెళ్లిపోయారు.

విశాఖ ప్ర‌జ‌ల‌తోపాటు దాదాపు యావ‌త్ రాష్ట్రం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ఏఏ అంశాల‌ను ప్ర‌స్తావిస్తారోన‌ని ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసింది. జ‌గ‌న్ కేవ‌లం అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. నాలుగు గంట‌ల స‌మ‌యంలో విశాఖ‌కు చేరుకున్న జ‌గ‌న్ నేరుగా కైలాస‌గిరికి బ‌య‌ల్దేరారు. కైలాసగిరికి వెళ్లే క్ర‌మంలో 24 కిలోమీట‌ర్ల మేర జ‌గ‌న్‌కు అఖండ స్వాగ‌తం ల‌భించింది. వేలాదిగా త‌రలి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

జ‌గ‌న్‌పై ఎక్క‌డిక‌క్క‌డ పూల‌వ‌ర్షం కురిపించారు. స్థానిక క‌ళాకారులు తీన్‌మార్ డ‌ప్పుల మోత‌ల‌తో జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా సుస్వాగ‌తం ప‌లికారు. జ‌గ‌న్ నేరుగా కైలాస గిరికి చేరుకున్న త‌రువాత ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. మొత్తంగా అభివృద్ధికి సంబంధించి రూ.1,290 కోట్ల ప‌నుల‌కు జ‌గ‌న్‌ శంకుస్థాప‌న చేశారు.

అనంత‌రం నేరుగా ఆర్‌కే బీచ్‌లో ఉన్న విశాఖ ఉత్స‌వ్ వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు జ‌గ‌న్‌. విశాఖ ఉత్స‌వ్‌ను లాంఛ‌నంగా ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన త‌రువాత కొద్ది సేపు లేజ‌ర్ షోను వీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన క్రాక‌ర్స్ వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. సీఎం జ‌గ‌న్ అంద‌రి ఊహ‌ల‌కు భిన్నంగా ఎలాంటి మాట‌లు, ప్ర‌స్తావ‌న లేకుండానే వేదికదిగి వెళ్లిపోయారు.

సీఎం జ‌గ‌న్ తీరుతో ఉద‌యం నుంచి ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న విశాఖ వాసులు డీలా ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ప్ర‌తిపాద‌న‌ త‌రువాత న‌గ‌రానికి వ‌చ్చిన జ‌గ‌న్‌ క‌చ్చితంగా ఏదైనా ప్ర‌క‌ట‌న, ఏదైనా ప్రాసెస్ వివ‌రిస్తార‌ని  ఆశ‌గా ఎదురుచూసినా ప్ర‌జ‌ల‌కు నిరాశే మిగిలింది. ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌కుండానే జ‌గ‌న్ విశాఖ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌ల్దేరి వెళ్లిపోయారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle