newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

విశాఖ‌కు చంద్రబాబు చేసిన తీర‌ని ద్రోహం ఇది..!

20-12-201920-12-2019 12:22:46 IST
Updated On 20-12-2019 12:43:08 ISTUpdated On 20-12-20192019-12-20T06:52:46.026Z20-12-2019 2019-12-20T06:52:38.247Z - 2019-12-20T07:13:08.181Z - 20-12-2019

విశాఖ‌కు చంద్రబాబు చేసిన తీర‌ని ద్రోహం ఇది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు ప‌రిపాల‌న‌ను త‌ర‌లించాల్సిన అవ‌స‌రం లేదని టీడీపీ వాదిస్తోంది. హైకోర్టును కూడా కర్నూలుకు త‌ర‌లించ‌వ‌ద్ద‌ని అమ‌రావ‌తిలోనే ఉంచాలంటూ రాజ‌ధాని రైతులు కొందరు ఆందోళ‌న‌కు దిగుతున్నారు. 

రాజ‌ధానుల‌పై తెలుగుదేశం వైఖ‌రిప‌ట్ల ఆ పార్టీ నేత‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, కేఈ కృష్ణ‌మూర్తులు జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించి టీడీపీ అధినేత‌కు షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొండ్రు ముర‌ళీ మ‌రో అడుగు ముందుకేసి విశాఖ‌లో కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ ఏర్పాటు చేస్తే టీడీపీకి ఎందుకు అంత బాధ..? అని ప్ర‌శ్నించారు. 

ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్ డిబేట్‌లో మాట్లాడిన కొండ్రు ముర‌ళీ సొంత పార్టీ విధానాల‌పైనే ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బీడు భూముల అమ‌రావ‌తిని చూసి ఎవ‌రు కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రార‌ని వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తిలో మ‌రో ప‌ది ల‌క్ష‌ల కోట్లు తీసుకొచ్చి పోసినా ఆ సొమ్మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతం గత‌ 70 ఏళ్లుగా నిర్ల‌క్ష్యానికి గురైంద‌న్నారు. 

విశాఖ‌ను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిట‌ల్‌గా వ్య‌తిరేకిస్తున్నందుకు ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు టీడీపీని తిట్టిపోస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉత్త‌రాంధ్ర‌లో కోటిమంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని, ఆ ప్రాంతం అంటే ఇంత చిన్నచూపు ఎందుక‌ని టీడీపీ పెద్ద‌ల‌ను కొండ్రు ముర‌ళీ సూటిగా ప్ర‌శ్నించారు. గ‌త ఐదేళ్లుగా విశాఖ‌ను దెబ్బ‌తీయ‌డానికి జ‌రిగిన ప్ర‌య‌త్నాన్ని కూడా ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు.

విశాఖ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా ఐటీ కంపెనీలు ముందుకొస్తే వాటిని అక్క‌డ కాకుండా విజయవాడకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని… దాంతో ఆ కంపెనీలు రాష్ట్రాన్నే వదిలేసి బెంగళూరు, చెన్నై తరలిపోయింది నిజం కాదా అని కొండ్రు మురళీ నిలదీశారు.

మూడు రాజ‌ధానుల విష‌యంలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యానికి వంద‌శాతం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నార‌ని చెప్పారు. ఈ విష‌యంలో టీడీపీ త‌న విధానాన్ని మార్చుకోక‌పోతే పార్టీకి రాజీనామా చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని కొండ్రు ముర‌ళీ ప్ర‌క‌టించారు. 

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు విభాగాలను ఏర్పాటు చేస్తుంటే తెలుగుదేశం, జనసేనలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు.

అమరావతిలోని కొంద‌రు రైతుల గురించి ఆలోచిస్తున్న టీడీపీ నేత‌లు కోట్లాది మంది నిరుద్యోగుల గురించి వెనుక‌బ‌డిన ప్రాంతాల గురించి ఎందుకు ఆలోచించ‌డం లేదని కొండ్రు ముర‌ళీ నిల‌దీశారు. అమ‌రావ‌తిని చూసి ఎవడైనా అక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందా..? అని ప‌దే ప‌దే ప్రశ్నించారు. ఈ అంశంలో ఉత్తరాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని కొండ్రు మురళీ పిలుపునిచ్చారు. మొత్తం మీద టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా అటు రాయ‌ల‌సీమ ఇటు ఉత్త‌రాంధ్ర నుంచి ఆ పార్టీ విధానానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle