newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

విశాఖలో సచివాలయానికి ఏర్పాట్లు

05-01-202005-01-2020 08:42:55 IST
2020-01-05T03:12:55.657Z05-01-2020 2020-01-05T03:12:36.565Z - - 05-08-2020

విశాఖలో సచివాలయానికి ఏర్పాట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు సిద్ధం అవుతోంది. మూడురాజధానుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. అమరావతి నుంచి రాజధాని విశాఖ కు తరలిపోవడం దాదాపు ఖాయమైపోయినట్టేనని తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులు, అమాత్యులు కూడా ఇందుకు తగ్గట్టు విశాఖలో ఏర్పాట్లు చూస్తున్నారు.

ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బందికి అవసరమైన కార్యాలయాలు, వసతి ఏర్పాట్ల కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఎక్కడ అనుకూలంగా భవనాలు వున్నాయో అన్వేషణ సాగుతోంది. 

ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం, సచివాలయం కోసం భవనాలకోసం అన్వేషిస్తున్నారు. రుషికొండ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనాలు అనేకం ఉండడంతో సచివాలయం కోసం ఇక్కడ ఉన్న ఐటీ భవనాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. భీమిలీ నడిబొడ్డున‘ ఓషన్ వ్యూ గెస్ట్ హౌస్’ గా పిలిచే ఓ అందమైన భవనం ఉంది. ఇది చిట్టివలస జ్యూట్ మిల్లుకు చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్. జూట్ మిల్లు మూత పడడంతో ఆ గెస్ట్ హౌస్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది.

ఈ భవనాన్ని తీసుకుని ఆధునీకరించి అందంగా తయారు చేయొచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు. అలా చేస్తే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అద్భుతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టు భోగట్టా. ఒక వేళ ఇదే గనుక జరిగితే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆపీస్ అహ్లాదకరమైన ప్రాంతంలో ఉన్నట్టేనంటున్నారు. విశాఖలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభిం1చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle