newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

విశాఖలో మరో గ్యాస్ లీకేజీ.. పరవాడలో ఘటన.. ఇద్దరు మృతి

30-06-202030-06-2020 06:53:00 IST
Updated On 30-06-2020 08:50:50 ISTUpdated On 30-06-20202020-06-30T01:23:00.484Z30-06-2020 2020-06-30T01:22:52.576Z - 2020-06-30T03:20:50.178Z - 30-06-2020

విశాఖలో మరో గ్యాస్ లీకేజీ.. పరవాడలో ఘటన.. ఇద్దరు మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖను గ్యాస్ లీకేజీలు వదలడం లేదు. తాజాగా మరో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపుతోంది. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయింది. సాయినార్ ఆఫ్ సైన్సెస్ కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి చెందారు. నలుగురికి అస్వస్థత కలగగా వారని ఆస్పత్రికి తరలించారు. 

సాయినార్ ఆఫ్ సైన్సెస్ లోని మృతులు షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన చంద్రశేఖర్, ఆనంద్‌బాబు, జానకిరామ్, సూర్యనారాయణ, హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 

కంపెనీలో లీకైన గ్యాస్ బెంజిమెడిజోల్ వేపర్‌గా గుర్తించారు. ఎల్జీ పాలిమర్స్ లో ఈమధ్యే స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలతో భయాందోళనలో విశాఖ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు విశాఖ కలెక్టర్, సీపీ, ఏడీసీపీ. పరిస్థితిని ఆరా తీసిన కలెక్టర్ వినయ్‌చంద్. గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీచేశారు. 

ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత కూడా హెచ్ పీసీఎల్ లో గ్యాస్ లీక్ ఆందోళన కలిగించింది. రెండురోజుల క్రితం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్ పీ వై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ లో అమ్మోనియా గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. నంద్యాలలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ సాగుతోంది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలను గాలికి వదిలేసింది. కార్మికుల భద్రతను ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీలోని చాలా సామగ్రి తుప్పు పట్టి ఉంది. దాన్ని మార్చాలన్న ధ్యాస యాజమాన్యానికి లేకుండా పోయింది. చిన్నచిన్న షాపుల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఆక్సిజన్‌ సిలిండర్లు లేకపోవడం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ ఘటనలో మరణించిన శ్రీనివాసరావు కుటుంబానికి 2 కోట్ల పరిహారం కావాలని డిమాండ్ చేసినా కేవలం రూ 50 లక్షలతో సరిపెట్టింది. 

 

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

   5 hours ago


ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

   5 hours ago


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

   5 hours ago


సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

   7 hours ago


ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

   7 hours ago


కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

   8 hours ago


కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

   9 hours ago


5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

   9 hours ago


గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

   10 hours ago


కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle