newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

విశాఖలో జగన్ టూర్.. అడుగడుగునా కోలాహలం

04-06-201904-06-2019 12:29:15 IST
Updated On 24-06-2019 16:31:16 ISTUpdated On 24-06-20192019-06-04T06:59:15.750Z04-06-2019 2019-06-04T06:59:13.132Z - 2019-06-24T11:01:16.779Z - 24-06-2019

విశాఖలో జగన్ టూర్.. అడుగడుగునా కోలాహలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన కొనసాగుతోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి పెందుర్తిలోని చినముషిడివాడకు బయలుదేరిన జగన్ కాన్వాయ్ శారదాపీఠానికి చేరుకుంది.

జనమంతా జగన్ వాహన శ్రేణికి సాదర స్వాగతం పలికారు. శారదాపీఠంలో జగన్ రెండు గంటలు ఉండవచ్చని భావిస్తున్నారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వైసీపీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ స్వామీజీని కలుస్తున్నారు. ఇటు కేబినెట్ కూర్పు, కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం గురించి ఆయన చర్చించనున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనేది స్వామీజీ ముహూర్తం పెట్టారు. అదే క్రమంలో స్వామీజీ ఆశీస్సులతో కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. స్వామీజీని కలిసిన అనంతరం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకుని. గన్నవరం వెళతారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తారు.

ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో 7గురు వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రానుండటంతో ఏ.డీ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారి విశాఖ రానుండడం తమకెంతో ఆనందంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడ చూసినా సీఎం జగన్, సీఎం జగన్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle