newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

విశాఖలో క్లాస్ వర్సెస్ మాస్

01-04-201901-04-2019 12:52:04 IST
2019-04-01T07:22:04.995Z01-04-2019 2019-04-01T07:22:02.760Z - - 22-09-2019

విశాఖలో క్లాస్ వర్సెస్ మాస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈసారి ఏపీ ఎన్నికల్లో అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తున్న పార్లమెంటు స్థానం విశాఖ. వలసనేతలను పార్లమెంటుకు పంపే విశాఖ ప్రజలు ఈసారి ఎవరికి జైకొడతారన్న అంశం చుట్టూ రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాక సడెన్‌గా జనసేనలో చేరిపోయి విశాఖ స్థానం నుంచి పోటీకి దిగిన జేడీ లక్ష్మీ నారాయణ చుట్టూ చర్చ జరుగుతోంది. లక్ష్మీ నారాయణ ఇదే స్థానాన్ని ఏరి కోరి ఎంచుకున్నారట.

విశాఖ అంటే క్లాస్ ఓటర్లు, విద్యావంతులు, ఉద్యోగులు అధికం. వాళ్లకే తన గురించి బాగా తెలిసే అవకాశం ఉంటుందనీ, వాళ్లయితేనే తనను ఎంపీని చేస్తారనేది ఈ మాజీ సీబీఐ జేడీ భావన. అంతేకాకుండా పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రజారాజ్యం పార్టీ మాజీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా విశాఖపట్నమే కావడం జేడీకి కలిసొచ్చే అంశం. ఇక ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఆమె 2009లో ఇక్కడి నుంచే ఎంపీ అయ్యారు.

పదేళ్లు గడిచినా విశాఖ ప్రజలు తనను మరచిపోలేదన్న ధీమా పురంధేశ్వరిలో ఉన్నా.. ప్రత్యేక హోదా డిమాండ్ ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రధాన ఎజెండా కావడంతో బీజేపీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అంచనా వేయలేని పరిస్థితి.  టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ మతుకుమిల్లి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ కేడర్ బలం తప్ప, శ్రీభరత్ అనే వ్యక్తి ఎవరన్నది కూడా సాధారణ ప్రజలకు తెలియదు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు చేసిన చెప్పుకోదగ్గ పనులు కూడా లేకపోవడంతో పరిచయం లేని ముఖంగానే శ్రీభరత్‌ని చూస్తారు. శ్రీభరత్ తాత దివంగత ఎంవీవీఎస్ మూర్తి మాత్రం అందరికీ తెలుసు. 

ఇక వైఎస్సార్సీపీ తరఫున ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ బరిలో ఉన్నారు. గతంలో వైఎస్ విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ‌సారి స్థానికులకే ఇవ్వాలనన్న ఉద్దేశంతో సత్యనారాయణను బరిలోకి దించి లోకల్ కార్డును ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. లోకల్‌గా అందరికీ తెలిసినవాడు కావడం, పలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవడం ఆయన బలాలు.

ప్రస్తుతం ఏపీలో జోరుగా వీస్తుందని భావిస్తున్న ఫ్యాను గాలి సత్యనారాయణకు బాగా కలిసొచ్చే అంశం అంటున్నారు. అందుకే విశాఖలో జేడీ, సత్యనారాయణ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందంటున్నారు.  క్లాస్ ఓటర్లు జేడీవైపు మొగ్గుతోంటే.. మాస్ ఓటర్లంతా వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నట్లు పలు క్షేత్రస్థాయి అంచనాలున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle