newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

వివేకా హత్యకేసులో ట్విస్ట్.. చంద్రబాబుకి కోర్టు నోటీసులు

09-01-202009-01-2020 13:51:42 IST
Updated On 09-01-2020 15:04:33 ISTUpdated On 09-01-20202020-01-09T08:21:42.348Z09-01-2020 2020-01-09T08:21:40.545Z - 2020-01-09T09:34:33.514Z - 09-01-2020

వివేకా హత్యకేసులో ట్విస్ట్.. చంద్రబాబుకి కోర్టు నోటీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది.

మరవైపు ఈ కేసును సిబిఐ కి బదిలీ చేయాలనీ కోరుతూ.. వైఎస్ సౌభాగ్యమ్మ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వ వాదన ఏంటో తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ ను కోరగా సిట్ నిర్వహించిన దర్యాప్తు చివరి దశలో ఉందని కోర్టుకు తెలిపారు. 

వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య కేసుపై ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కూడా కోర్టును ఆశ్రయించారు.

ఈకేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని, వెంటనే కేసుని సిబిఐ అప్పగించాలన్నారు. ఆమె పిటిషన్ ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. సౌభాగ్యమ్మ పిటిషన్‌ పై జనవరి 19 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్‌ను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో  62 మంది సాక్షులను సిట్ విచారించింది. 

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్‌ - చదవండి 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle