newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

వివాదాస్పద జీవోను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

31-10-201931-10-2019 12:08:45 IST
Updated On 31-10-2019 15:10:47 ISTUpdated On 31-10-20192019-10-31T06:38:45.917Z31-10-2019 2019-10-31T06:38:32.724Z - 2019-10-31T09:40:47.238Z - 31-10-2019

వివాదాస్పద జీవోను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని ప్రాంతీయ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అభ్యర్థించినా, హెచ్చరించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను చెప్పినట్లుగానే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గురించి నిరాధారమైన వార్తలు పత్రికలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా చట్టపరమైన చర్చలు తీసుకోవడానికి ఈ చట్టం అవకాశమిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

అయితే నిరాధార వార్తలు రాసిన వారిని అరెస్టులు చేయడం కాకుండా సదరు వార్తలు ప్రచురించిన పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసే అధికారాన్ని కూడా ఆయా ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఈ జీవోను రూపొందించాలని అక్టోబర్ 16నే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు యూనియన్లు, పౌర సమాజ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా నిరసన తెలిపారు. అయితే అప్పట్లోనే పాలక పక్షం వివరణనిస్తూ ఇది అధికార వికేంద్రీకరణ చర్య మాత్రమేనని సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్‌కి మాత్రమే దఖలు పడి ఉన్న అధికారాలను ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులకు బదలాయిస్తున్నట్లు పేర్కొంది. 

పైగా నిరాధార వార్తలు ప్రచురించి ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగించే వారిపై కేసులు నమోదు చేయడం అనేది చిట్టచివరి ప్రయత్నంగానే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్పష్టం చేసింది. నిరాధార వార్తలు ప్రచురిస్తే సదరు ప్రచురణా సంస్థకు మొదట రిజాయిండర్ పంపుతామని తప్పు వార్త పట్ల వివరణను మరుసటి రోజు అదే స్పేస్‌లో ప్రచురించాలని కోరతామని ప్రభుత్వం తెలిపింది.

కానీ తన చర్య ప్రజాస్వామిక పద్ధతులకు విరుద్ధమని, పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వంపై నలు దిశల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివిధ అంశాలను ఎలాంటి వక్రీకరణ, దురభిమానాలు లేకుండా ప్రచురించేలా చేయడమే తమ ప్రయత్నమని ప్రభుత్వం సమర్థించుకుంది.

అయితే ప్రభుత్వ వివరణ జర్నలిస్టు సోదరుల భయాందోళనలను తగ్గించడంలో విఫలమైంది. మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని. ప్రత్యేకించి పాలక పార్టీ లేక ప్రభుత్వాన్ని విమర్శించే ప్రచురణ సంస్థలను వేధిస్తారని భయాలు కూడా వ్యాపించాయి. 

మీడియా సంస్థల ఆందోళనను ఖాతరు చేయని వైఎస్ జగన్ ప్రభుత్వం అనుకున్నంత పనీ చేసింది. మీడియాను ఎలాగోలా అదుపు చేయడానికి వీలు కల్పించే ఈ జీవో న్యాయపరంగా నిలబడుతుందా అనేది ప్రశ్నార్థకమే. 

వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ వివాదాస్పద జీవోపై మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఈ జీవో ఉందని ఆయన అన్నారు. ‘‘ప్రశ్నించడం, విమర్శించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం.. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. ప్రజా గొంతుకను నొక్కేయడానికే వైసీపీ పార్టీ దీన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన మీడియ సంస్థలపై, ప్రజలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టే ఆస్కారాన్ని కల్పించారు. ఈ జీవోని రద్దు చేసే వరకూ అవసరమైతే మేము రోడ్లెక్కి నిరసనలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము’’ అని బాబు ట్వీట్ చేశారు.

ఈ వివాదాస్పద జీవో పర్యవసానాలు ఎలా ఉండబోతాయన్నది తెలియడానికి వేచి చూడాల్సిందే మరి.

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   6 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   7 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   9 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   9 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   14 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   14 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   15 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle