newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

వివాదాలే కాదు...రికార్డుల్లోనూ ‘వరమే’

07-01-201907-01-2019 16:30:58 IST
Updated On 07-01-2019 18:49:26 ISTUpdated On 07-01-20192019-01-07T11:00:58.531Z07-01-2019 2019-01-07T10:49:30.008Z - 2019-01-07T13:19:26.868Z - 07-01-2019

వివాదాలే కాదు...రికార్డుల్లోనూ ‘వరమే’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం.. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్. దీని నిర్మాణంలో సరికొత్త రికార్డు ఆవిష్కృతమయింది. కాంక్రీట్‌ పనుల్లో శరవేగంగా దూసుకెళుతున్న ఈ ప్రాజెక్ట్‌ గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయినట్టు అధికారులు తెలిపారు.  ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొనడం విశేషం. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్‌ వెలుగుల్లోనూ పనులు చేశారు. నాలుగువేల మంది సిబ్బంది ఈ మహాక్రతువులో పాలుపంచుకున్నారని అధికారులు తెలిపారు.

2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం అధిగమిచింది. 16 గంటల వ్యవధిలోనే ఈ రికార్డు పోలవరం సొంతం అయింది. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన పోలవరం ప్రాజెక్టు సిబ్బందికి, అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను చంద్రబాబు అందుకున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా 24 మంది సభ్యులు ఉన్న గిన్నిస్ బృందం కాంక్రీటు ఫిల్లింగ్ పనులను వీడియో ద్వారా చిత్రీకరించింది. అలాగే కాంక్రీటు పనుల వేగం, నాణ్యతను కూడా వారు పరిశీలించారు. గత నాలుగేళ్లలో పోలవరం పనులు 60 శాతం పూర్తికాగా, 2019 మే నాటికి నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మరోవైపు పోలవరం పనులు జరిగిన తీరుపట్ల ఏపీ మంత్రి దేవినేని ఉమా సంతృప్తి వ్యక్తంచేశారు. పోలవరం పోలవరం ప్రాజెక్టులో సాధించిన గిన్నిస్‌ రికార్డును రెండు మూడు దశాబ్ధాలపాటు ఎవరూ బ్రేక్‌ చేయలేరని మంత్రి దేవినేని అన్నారు.  కేంద్రం సహకరించకపోయినా.. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం వున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో పట్టుదలతో పోలవరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చు చేసిన దానిలో కేంద్ర ప్రభుత్వం రూ.3,650 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుని సందర్శించేవారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌ 23న ప్రారంభించింది. ప్రజాప్రతినిధులతో పాటు వేలాదిమంది సాధారణ ప్రజానీకం ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle