newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

విలువలతో కూడిన విద్య ఇంగ్లీషుతో రాదా స్వామీ!

25-11-201925-11-2019 08:40:57 IST
2019-11-25T03:10:57.518Z25-11-2019 2019-11-25T03:10:53.375Z - - 15-12-2019

విలువలతో కూడిన విద్య ఇంగ్లీషుతో రాదా స్వామీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు స్వాములు.. ఒక రాజ్యాంగ పదవిని అలంకరించి ఫక్తు రాజకీయనేత... విలువలతో కూడుకున్న విద్య గురించి తమ అభిప్రాయాలు చెప్పారు. మాతృభాషలో విద్యాభ్యాసం తప్పనిసరి అనే కోణం నుంచి మొదలు పెట్టి విద్యలో విలువల బోధన చాలా ముఖ్యమని ఈ ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6 నుంచి 10 వరకు ఇంగ్లీషును విద్యా మాధ్యమంగా చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నానా యాగీ చేసి ప్రస్తుతం రకరకాల కారణాలతో చల్లబడి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు అవసరమే కానీ మాతృభాషను విస్మరించవద్దని కొందరు.. మీడియం తెలుగా, ఇంగ్లీషా అనేది కీలకం కాదని విద్యలో విలువలు ఉన్నాయా అనేది ప్రధానాంశమని ఇప్పుడు ఆథ్యాత్మక స్వాములు చెబుతుండటం గమనించదగ్గ విషయం. పైగా వీరి అభిప్రాయాలు ఒక్కో పత్రికలో ఒక్కో రకంగా రావడంతో ఎవరు ఏమి చెప్పారు అనే విషయంలో స్పష్టత రాలేదు. పత్రికలలో వెలువడిన వారి వ్యక్తీకరణలను చూసిన తర్వాతే వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

తెలుగు, ఇంగ్లీషు మీడియంలు ముఖ్యం కాదు. విలువలతో కూడిన విద్య ఉందా లేదా అనే విషయమే ముఖ్యం. అలాంటి విద్య లేనందునే తండ్రిని కొడుకు, తల్లిని కూతురు చంపుతున్న ఘటనలు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష లేకపోవడం వల్లే తెలుగు అంతరించిపోతోంది. అని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పేర్కొన్నారు. 

అదే సమయంలో నైపుణ్యం కోసం ఆంగ్ల మాధ్యమం కావాల్సిందే. అలాగని మాతృభాషను విస్మరించకూడదు. మనం మన ధర్మాన్ని అనుసరించినంత కాలం అన్యమత ప్రచారం వల్ల భారతీయ ధర్మానికి ఏమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలి అని దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి తెలిపారు.

అదే సమయంలో మాతృభాషలో విద్యాభ్యాసం కూడా తప్పనిసరి అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మళ్లీ నొక్కి చెప్పారు. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో పాల్గొన్న ఆయన ఒక ప్రాంత సంస్కృతికి అక్కడి ప్రజల మాతృభాషే జీవనాడి అని, అలాంటి మాతృభాషను ప్రోత్సహించడం, కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంపై ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. 

 పైగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 350-ఏ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలోనే ప్రాధమిక విద్యాభ్యాసం జరిగేలా చొరవ తీసుకోవాలని అన్నారు. అన్ని భారతీయ భాషలకు సరైన గౌరవం దక్కాలని, మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదని, కానీ భారతీయ భాషలకు ప్రమాదకర పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు.

ఈ ప్రముఖుల అభిప్రాయాలు ఏవీ తప్పు పట్టాల్సినవి కావు. విస్తృతార్థలో ఈ ముగ్గురు వాదనలూ అంగీకరించాల్సిందే. కానీ 70 ఏళ్ల స్వతంత్ర పాలనలో మాతృభాషల్లో విద్యాబ్యాసాన్ని అటకెక్కించి, ఇంగ్లిషుకు పట్టం కట్టిన విషమ పరిణామాలకు ఎవరు కారకులు అనే ప్రధానాంశం జోలికి వెళ్లకుండా హితవ్యాక్యాలు పలికితే ప్రయోజనం ఎవరికి అనేదే అసలు ప్రశ్న. దేశమంతటా 50 శాతం పైగా కాన్వెంట్లలో ఇంగ్లిషు మాధ్యమాన్ని దశాబ్దాల పాటు కొనసాగిస్తూ, తమ పిల్లలను అక్కడే చదివించి తాము తరిస్తూ, వారినీ తరింప చేస్తున్న వారు కూడా హితవాక్యాలు పలికితే అది ద్వంద్వ ప్రమాణం కాదా. కపటత్వం కాదా.. 

అన్నిటికంటే ముఖ్యమైనది గత రెండు తరాల పిల్లలు అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు రెండు భాషల్లో నైపుణ్యం లేని అధోగతికి చేరుకోవడానికి కారణమెవ్వరు. అది తెలుగైనా, ఇంగ్లీషైనా బట్టీ కొట్టి నూటికి 90 పైగా మార్కులను తెచ్చుకుంటున్న వారి విద్యా నైపుణ్యం, భాషా నైపుణ్యం దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో వెలవెలబోతోంది. అటు మాట్లాడే అంటే కమ్యూనికేషన్ నైపుణ్యమూ లేక ఇక మంచి భాషలో రాసే నైపుణ్యం లేక గత రెండు తరాల పిల్లలు లక్షలాదిమంది ఉద్యోగాలు లేక వీధులపాలవుతున్న దుస్థితికి కారకులెవ్వరు?

ఈ కీలకమైన అంశాన్ని విస్మరించి తెలుగు కావాలి. ఇంగ్లీషు కావాలి అంటూ వాదులాడుకుంటూంటే విద్యా బోధనలో బట్టీ చదువులు తప్పితి మరే మౌలిక మార్పులు రావు. తెలుగులోనే, మాతృభాషలోనే బట్టీల కొట్టే చదవు తప్పనప్పుడు ఇంగ్లీషును మాధ్యమం చేస్తే పిల్లలు ఇంకాస్త బట్టీ కొట్టవలసి రావడం తప్పదు.

ఈ బట్టీ చదువుల ఖర్మ వల్లే మన విద్యార్థులకు ఏ అంతర్జాతీయ అవార్డులూ రావు. రాబోవు కూడా. మాతృభాషకు ద్రోహం అని ఒకరు, పేద పిల్లలకు ఇంగ్లీషు చదువులొద్దా అని మరొకరూ చీలిపోయి ఆధిపత్య రాజకీయాల్లోకి భాషను, బోధనను తీసుకు వెళితే సమస్య అసలు పరిష్కారం కాదు.

 

 

 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle