newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

విరామ‌మా..? వైరాగ్య‌మా..?

27-10-201927-10-2019 18:09:29 IST
Updated On 27-10-2019 19:11:31 ISTUpdated On 27-10-20192019-10-27T12:39:29.702Z27-10-2019 2019-10-27T12:39:27.208Z - 2019-10-27T13:41:31.784Z - 27-10-2019

విరామ‌మా..? వైరాగ్య‌మా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనుకున్న‌దే జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ గుడ్‌బై చెప్పారు. పార్టీకే కాకుండా ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. ఈ మేర‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఆయ‌న లేఖ రాశారు. కాగా, ఆయ‌న రాజ‌కీయాల నుంచి వెదొలుగుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వ‌ల్ల‌భ‌నేని వంశీకి తెలుగుదేశం పార్టీలోనే కొంద‌రితో విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కీల‌క నేత దేవినేని ఉమ‌తో వంశీకి పొస‌గ‌దు. దీంతో పార్టీలోనే ఉంటున్నా ఆయ‌న కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యే వారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌గ‌న్ హ‌వాను త‌ట్టుకొని స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించారు.

గెలిచిన నాటి నుంచీ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవుతున్నారు. అయితే, వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక వంశీకి ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌ల ముందు ఆయ‌న పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేశార‌న‌, అవి కూడా ఫోర్జరీ ప‌ట్టాలు పంపిణీ చేసి ఓట్లు వేయించుకున్నార‌ని ఆయ‌నపై కేసు న‌మోదైంది. ఈ కేసు వెనుక నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇంఛార్జి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, కొంద‌రు అధికారులు ఉన్నార‌ని వంశీ ఆరోపిస్తున్నారు.

టీడీపీకి వంశీ బ‌ల‌మైన అభ్య‌ర్థిగా భావించిన జ‌గ‌న్ ఆయ‌న‌కు పోటీగా గ‌త ఎన్నిక‌ల్లో స్థానికుడు కాక‌పోయినా ఆర్థికంగా బ‌లంగా ఉన్న ఎన్ఆర్ఐ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో యార్ల‌గ‌డ్డ బాగా శ్ర‌మించి వంశీకి గ‌ట్టి పోటీ ఇచ్చినా గెల‌వ‌లేక‌పోయారు. వంశీ, యార్ల‌గ‌డ్డ మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు కాస్తా వ్య‌క్తిగ‌త వైరంగా మారింది.

ఇటీవ‌ల వంశీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పుడు ఆయ‌న వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, ఆయ‌న వ‌ర్గీయులు ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. వంశీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకోవ‌ద్దంటూ జ‌గ‌న్‌పై ఒత్తిడి తెస్తున్నారు. వంశీ వ‌ల్ల త‌మ క్యాడ‌ర్ ఇబ్బంది ప‌డింద‌ని, ఇప్పుడు ఆయ‌న‌నే తీసుకువ‌స్తే ఎలా అని యార్ల‌గ‌డ్డ ప్ర‌శ్నిస్తున్నారు. రేపు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నున్నారు.

దీంతో వంశీ ఎంట్రీకి వైసీపీలో కూడా అంత సానుకూల ప‌రిస్థితులు లేవు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు టీడీపీ త‌ర‌పున కూడా జ‌ర‌గ‌లేదు. వంశీ త‌మ పార్టీ నుంచి వెళ్లిపోయిన‌ట్లే టీడీపీ కూడా భావించింది. దీంతో అటు టీడీపీలో ఉండ‌టం, ఇటు వైసీపీలో చేర‌డం కూడా వంశీకి ఇబ్బందిగా మారింది. దీంతో ఆయ‌న పార్టీకి, ప‌ద‌వికే కాకుండా రాజ‌కీయాల‌కు కూడా గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించారు.

కాగా, ప్ర‌స్తుతం రాజ‌కీయంగా త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌రిస్థితులు ఉన్నందున కొంత కాలం పాటు సైలెంట్‌గా ఉండి త‌ర్వాత మ‌ళ్లీ యాక్టీవ్ కావాల‌నే వ్యూహంలో వంశీ ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుతో స‌యోధ్యకు వైసీపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నందున స‌యోధ్య కుదిరే వ‌ర‌కు రాజ‌కీయాల‌కు విరామం ఇస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, వంశీ మాత్రం ప‌క్కా వ్యూహంతోనే ఉన్నార‌ని చెబుతున్నారు. అస‌లు వంశీ ఆలోచ‌న ఏంటో రాజ‌కీయ వ‌ర్గాల‌కు ఏ మాత్రం అంతుచిక్క‌డం లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle