newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

25-05-202025-05-2020 08:58:47 IST
Updated On 25-05-2020 10:11:37 ISTUpdated On 25-05-20202020-05-25T03:28:47.128Z25-05-2020 2020-05-25T03:28:43.853Z - 2020-05-25T04:41:37.414Z - 25-05-2020

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ ఈనెల 31వరకు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సడలింపులు ఇచ్చింది. ఏపీలో అయితే ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం మీదుగా పలు ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి. 25వ తేదీ నుంచి దేశీయంగా విమానాలు సర్వీసులు  తిరగడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో విమానాలు, రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేవారికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులంతా వీటిని పాటించాలని సూచించింది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలు తెలిసేలా సంబంధిత ట్రావెలింగ్ ఏజెన్సీలు లేదా సంస్థలు టికెట్ వెనుక ముద్రించాలని ప్రభుత్వం సూచించింది. 

ప్రయాణాలు చేసే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యసేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో సెల్ప్ అసెసె మెంట్ చేసుకుని వుండాలి. కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇతర విధివిధానాలను ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో తప్పక అనౌన్స్ మెంట్ రూపంలో ప్రచారం చేయాలి.  రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రయాణికులందరూ బయలుదేరడానికి ముందే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానం / రైలు / బస్సులు ఎక్కడానికి అనుమతించాలి. 

బోర్డింగ్, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి.  బస్టాండు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లలలో తప్పని సరిగా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. విమానాశ్రయాలు / రైల్వే స్టేషన్లు / బస్ స్టేషన్లలో క్రమంతప్పకుండా శానిటైజేషన్ / క్రిమీసంహారక ద్రావణంతో శుభ్రంచేయాలి. సబ్బులు, శానిటైజర్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి. 

బయటకు వెళ్లే ప్రదేశంలో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణీకులు 14 రోజులు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండాలి. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు తెలియజేయాలి. పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న కరోనా చికిత్స కేంద్రానికి తరలించాలి. వారు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

కరోనా వైరస్ కు సంబంధించి తేలికపాటి లక్షణాలు ఉన్నవారు తగిన సౌకర్యాలు ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఐసిఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం కోవిడ్ కేర్ సెంటర్లలో (ప్రభుత్వ మరియు ప్రైవేట్ సౌకర్యాలు రెండూ) అందుబాటులో ఉంటాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐసిఎంఆర్ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ కేర్ సెంటర్లో పరీక్షించబడతారు. ఒకవేళ నెగిటివ్ రిపోర్టు వస్తే అతడు / ఆమె ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండేందుకు అనుమతిస్తారు. ఆసమయంలో మరోసారి ఏమైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆయా రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కు సంబంధించిన ప్రొటోకాల్స్  రూపొందించుకోవచ్చని కోవిడ్ 19 స్టేట్ నోడల్ అధికారి శ్రీకాంత్ చెప్పారు. 

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   2 hours ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   2 hours ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   2 hours ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   2 hours ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   2 hours ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   2 hours ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   3 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   15 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   a day ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   12-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle