newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?

13-12-201913-12-2019 12:51:15 IST
2019-12-13T07:21:15.989Z13-12-2019 2019-12-13T07:21:13.347Z - - 19-01-2020

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అసెంబ్లీలో పరిణామాలపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతివిషయంలో విపక్షం విమర్శలకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలన్నారు.  రెండు టీవీ ఛానెళ్ళ ప్రసారాలను మళ్లీ నిలిపివేయడం, వాటితో పాటు ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం ప్రత్యక్ష కక్ష సాధింపేనన్నారు సోమిరెడ్డి. 

వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందన్నారు. నిషేధం విధించినంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపలేదని అన్నారు.

ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేస్తున్నట్టు కనిపిస్తోందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ పత్రిక సాక్షి బరితెగించి రాతలు రాసిందని, ఇప్పుడు సాక్షి రాసేది తప్పులని సీఎం జగన్ సెలవిస్తున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇటు ఉల్లిపాయల కొరతపైన ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఉల్లిపాయల కోసం ప్రజలు పడుతున్న పాట్లు చూస్తుంటే బాధేస్తోంది. గంటల తరబడి క్యూలో  నిలుచుని నరకం అనుభవిస్తున్నారు.ఊరికి 30 మంది వలంటీర్లు, సచివాలయం సిబ్బందిని పెట్టి ఏం చేస్తున్నట్టు. కనీసం ఉల్లి పంపిణీ బాధ్యతను కూడా వాళ్లకు అప్పగించలేని అయోమయ పాలన ఏపీలో సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle