newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

విభజన సమస్యల పరిష్కారంలో ముందడుగు

29-06-201929-06-2019 08:38:11 IST
Updated On 03-07-2019 13:25:56 ISTUpdated On 03-07-20192019-06-29T03:08:11.381Z29-06-2019 2019-06-29T03:07:52.548Z - 2019-07-03T07:55:56.651Z - 03-07-2019

విభజన సమస్యల పరిష్కారంలో ముందడుగు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విభజన సందర్భంగా తలెత్తిన అనేక సమస్యలను సామరస్యంగా, చర్చలతో పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్చలు జరుగుతాయి. ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన తదితర అంశాలపై చర్చిస్తారు.

గోదావరి నీటిని తరలించే విషయంలో తగిన ప్రాతిపదికలు రూపొందించే బాధ్యతను రెండు రాష్ట్రాల అధికారులకు సంయుక్తంగా స్వీకరిస్తారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఇఎన్సీల ఆధ్వర్యంలో ఈ పని జరుగుతుంది. జూలై 15లోగా అధికారులు ముఖ్యమంత్రులకు నివేదిక అందించాలని గడువు విధించారు.ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.

సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశం గొప్ప ప్రారంభమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. విభజన సందర్భంగా తలెత్తిన అన్ని సమస్యలను సామరస్య పూర్వకంగా, సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. 

కత్తులు దూసేది లేదని, చేతులు కలపాలని చెప్పారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించాలనేది తమ విధానమని, అదే విధానంతో మహారాష్ట్రతో వ్యవహరించి ఫలితం సాధించామన్నారు. తెలంగాణ, ఎపి కూడా అలాగే వ్యవహరించి రెండు రాష్ట్రాలకు మేలు కలిగే విధంగా వ్యవహరిస్తాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేసి, ప్రజలకు ఫలితాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులకు సూచించారు. 

మరోవైపు ఈవిషయంలో కేసీఆర్ విజన్ పై ఏపీ సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో, నీటి పారుదల రంగం విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ఇద్దరం ఒకటేననే భావన కలిగి ఉండాలని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, కానీ రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలను రెండు రాష్ట్రాల్లోని సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని తాను భావించానని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఎవరో పరిష్కరించడం కంటే, ఈ రెండురాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. రెండు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మొత్తం మీద ఐదేళ్ళుగా ఏర్పడిన చిక్కుముడులు ఇప్పుడిప్పుడే విడిపోతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle