newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

విధేయుల‌కు.. వెంట న‌డిచిన వారికే పెద్ద‌పీట‌

08-06-201908-06-2019 09:03:23 IST
Updated On 24-06-2019 14:43:45 ISTUpdated On 24-06-20192019-06-08T03:33:23.984Z08-06-2019 2019-06-08T03:33:12.673Z - 2019-06-24T09:13:45.417Z - 24-06-2019

విధేయుల‌కు.. వెంట న‌డిచిన వారికే పెద్ద‌పీట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్ లో ఎవ‌రికి చోటు ద‌క్కుతుందా అనే ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. క్యాబినెట్ కూర్పుపై సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన జ‌గ‌న్ ఒకేసారి 25 మందికి మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించారు. సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌ను లెక్క‌లోకి తీసుకుంటూనే విధేయుల‌కు, క‌ష్టాల్లో త‌న వెంట న‌డిచిన వారికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పెద్ద‌పీట వేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి జ‌గ‌న్ వెంట ఉన్న వారిలో చాలామంది ఈసారి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

వైఎస్సార్ మ‌ర‌ణానంతరం జ‌గ‌న్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన‌ప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డించారు. ఉప ఎన్నిక‌లు సైతం ఎదుర్కున్నారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటాన‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో సైతం హామీ ఇచ్చారు. ఈ మేర‌కు  జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక‌, సుభాష్ చంద్ర‌బోస్ సైతం మంత్రి ప‌ద‌వి వ‌దులుకొని జ‌గన్ వెంట న‌డిచినందుకు త‌గిన గుర్తింపు ద‌క్కింది. వైసీపీలో చేర‌డంతో వ‌చ్చిన 2012 ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. అయినా, 2014, 2019లో జ‌గ‌న్ ఆయ‌న‌కు టిక్కెట్ ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు బీసీ కోటాలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి సైతం ఇస్తున్నారు.

ఇక‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ సైతం జ‌గ‌న్ వెంట న‌డిచారు. జ‌గ‌న్ పై కేసులు న‌మోదైన సంద‌ర్భంలో మంత్రిగా ఉన్న మోపిదేవిని సైతం జైలుకు పంపారు. దీంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో పాటు రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయినా, 2014, 2019లో రేప‌ల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఆయ‌న‌కు జ‌గ‌న్ ఇచ్చారు. రెండుసార్లూ ఆయ‌న ఓడినా ఇప్పుడు జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటున్నారు. 

జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్పుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మంత్రిగా ఉన్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లోనే ఉండిపోగా ఆయ‌న సోద‌రుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మాత్రం జ‌గ‌న్ వెంట న‌డిచి ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్నారు. ఈసారి ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం సీనియ‌ర్ అయినా, మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్నా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును ప‌క్క‌న పెట్టి ఆది నుంచీ త‌న వెంట న‌డిచిన కృష్ణ‌దాస్ కే జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు.

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత  సైతం జ‌గ‌న్ వెంట న‌డిచి ఉప ఎన్నిక‌లు ఎదుర్కొన్నారు. ఆమెకు ఇప్పుడు ఏకంగా ఎస్సీ కోటాలో ఉప ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ద‌క్క‌నుంది. ఇక‌, మేక‌పాటి కుటుంబం సైతం ఆదినుంచీ జ‌గ‌న్ వెంటే ఉన్నారు. దీంతో గౌత‌మ్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

ఇక‌, అనిల్ కుమార్ యాద‌వ్‌, పుష్ప‌శ్రీవాణి, ఆదిమూల‌పు సురేష్‌, కొడాలి నాని, అంజ‌ద్ బాషా, గుమ్మ‌నూరు జ‌య‌రాం, క‌ల‌త్తూరు నారాయ‌ణ‌స్వామి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వంటి వారు 2014లో వైసీపీ త‌ర‌పున గెలిచారు. అప్పుడు టీడీపీ ఫిరాయింపుల‌కు తెర‌తీసి అనేక విధాలుగా ప్ర‌లోభ‌పెట్టినా వారు వైసీపీలోనే ఉన్నారు. దీంతో వీరిని జ‌గ‌న్ గుర్తించి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

జ‌గ‌న్‌, వైసీపీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం అండ‌గా ఉంది.పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డి జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా మెలిగారు. రాయ‌ల‌సీమ‌లో ప్ర‌త్యేకించి చంద్ర‌బాబు స్వంత జిల్లా చిత్తూరులో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్నారు. ఈసారి చిత్తూరులో 13 సీట్లు వైసీపీ గెలవ‌డంలోనూ పెద్దిరెడ్డిది కీల‌క పాత్ర‌. దీంతో ఊహించిన‌ట్లుగానే జ‌గ‌న్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న‌కు కీల‌క పోర్టుఫోలియో ద‌క్కే అవ‌కాశం ఉంది. మొత్తంగా త‌న‌ను న‌మ్మి, క‌ష్టాల్లో వెంట‌నే న‌డిచిన వారికి జ‌గ‌న్ మంత్రివ‌ర్గ కూర్పులో ప్రాధాన్య‌త ఇచ్చారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle