newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

విద్యుత్ రంగంలో ఏపీ వెలుగుల ప్రస్థానం

16-05-201916-05-2019 07:34:47 IST
2019-05-16T02:04:47.921Z16-05-2019 2019-05-16T02:04:39.586Z - - 22-07-2019

విద్యుత్ రంగంలో  ఏపీ వెలుగుల ప్రస్థానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకప్పుడు పవర్ హాలీడేలు, నిరంతర విద్యుత్ కోతలు.. కానీ నేడు రెప్పపాటు కూడా పోని కరెంట్. ఏపీ విద్యుత్‌ రంగంలో గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో గణనీయమైన అభివృద్ధిని సాధించి, ప్రత్యేకతను చాటుకుంది. మండు వేసవిలో సైతం విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా ఏపీ సగర్వంగా నిలిచింది.

సరిగ్గా జూన్‌, 2014లోరోజుకు సగటున 22.5 మిలియన్‌ యూనిట్ల లోటుతో ఉన్న విద్యుత్‌ రంగం నేడు సున్నా విద్యుత్‌ లోటుకు చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న చర్యలతోనే సాధ్యమైంది. అంతేకాకుండా విద్యుత్‌ లోటుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారిపోయింది. 

గతంలో 9,529 మెగావాట్లుగా ఉన్న వ్యవస్థాపక ఉత్పత్తి సామర్ధ్యం ఇప్పుడు 19,080 మెగావాట్లకు చేరుకుంది. ఏపీజెన్‌కో 2,250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అందిస్తోంది. ఇందులో కృష్ణపట్నం సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుండి 1600 మెగావాట్లు, రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ) స్టేజ్‌ 4 నుండి 600 మెగావాట్లు, నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ వద్ద నున్న హైడల్‌ స్టేషన్‌ నుండి రెండు 25 మెగావాట్ల చొప్పున 50 మెగావాట్లను ఉత్పత్తి చేసింది.

అలాగే పునరుత్పాదక ఇంధనం ద్వారా మరికొంత విద్యుత్‌ను నిల్వచేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీజెన్‌కో పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మితమవుతున్న 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుతో పాటు మరో రెండు 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ యూనిట్లను విజయవాడ, కృష్ణపట్నం పోర్టుల వద్ద ఏర్పాటు చేస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను తీర్చేందుకు, మిగులు విద్యుత్ వైపు ముందుకు నడిచేందుకు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా నష్టాలను అధిగమించేందుకు రూ.10 వేల కోట్ల విలువైన విద్యుత్‌ను ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలు చేసింది.

ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యుత్‌ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యుత్‌ వినియోగాన్ని వీలైనంతమేర తగ్గించుకునేలా ఐఎస్‌ఐ ఉత్పత్తులను వాడేలా ప్రజల్లో చైతన్యం కల్పించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, సోలార్‌ పంపుసెట్ల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే విద్యుత్‌ పొదుపు, ఇంధన సామర్ధ్యం వంటి ప్రమాణాలను ప్రోత్సహించారు. దీంతో లోటు విద్యుత్‌తో కొట్టుమిట్టాడిన రాష్ట్రం కాస్త మిగులు విద్యుత్‌ వైపు పరుగులు పెడుతోంది.

వ్యవసాయరంగంలో లక్ష విద్యుత్‌ మోటార్లను ఎనర్జీ ఎఫిషీయన్సీ మోటార్లుగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఏపీ ట్రాన్స్‌కో 99.90 శాతం మేర సరఫరా చేస్తూ ముందు వరుసలో నిలిచింది. ఈ క్రమంలోనే 2014లో 3.59 శాతం మేర ఉన్న సరఫరా నష్టాలను 2019 ఆర్థిక సంవత్సరం నాటికి 3.12 శాతానికి తగ్గించుకోగలిగింది. ఇదే క్రమంలో ఏపీ డిస్కంలు కూడా ఉత్పత్తి, సరఫరా నష్టాలను 9.72 శాతానికి తగ్గించుకోగలిగాయి.

రాష్ట్రంలో పవన విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 4,059 మెగావాట్ల పవన విద్యుత్‌, 2,591 మెగావాట్ల మేర సౌర విద్యుత్తు ఉంది. రాష్ట్ర విభజన నుండి ఇప్పటి వరకూ రూ.36,604 కోట్ల మేర పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. దీని ద్వారా అటు విద్యుత్‌ ఉత్పత్తి పెరగడంతోపాటు ఇటు ఉద్యోగావకాశాలు కూడా లభించాయి. ఈ పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్రంలోని కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో 13 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం తీసుకున్న ముందుచూపుతో విద్యుత్ రంగంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle