newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

విద్యుత్ బిల్లులపై జగన్ కీలక నిర్ణయం

14-05-202014-05-2020 08:19:39 IST
Updated On 14-05-2020 08:59:56 ISTUpdated On 14-05-20202020-05-14T02:49:39.305Z14-05-2020 2020-05-14T02:49:36.036Z - 2020-05-14T03:29:56.686Z - 14-05-2020

విద్యుత్ బిల్లులపై జగన్ కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్ 19 నేపథ్యంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలిచ్చారు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వెసులుబాటు కల్పించారు. జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలను జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు అత్యధికంగా వచ్చాయి..దీనిపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ సమయంలో వేలకు వేలు విద్యుత్తు బిల్లులు రావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో విద్యుతు బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్‌ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలకు అప్పగించింది.కోవిడ్ వల్ల ఇళ్ళకు రాలేకపోయిన మీటర్ రీడింగ్ సిబ్బంది గత నెలల ఆధారంగా బిల్లులు జారీచేశారు. 

వినియోగదారుల్లో ఉన్న అపోహలను దూరం చేయడానికి బిల్లులను పారదర్శకంగా వారి సమక్షంలోనే తనిఖీ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు ఏ విధంగా తీశామో... వినియోగదారులకు భారం ఏ విధంగా తగ్గించామో వివరించాలి. ఇంకా అనుమానాలుంటే అధికారులు వారికి అర్థమయ్యేలా తెలియచెప్పాలని నిర్ణయించారు. 

డిస్కమ్‌లు తమ వెబ్‌సైట్‌లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత రెండేళ్ల విద్యుత్‌ వినియోగ వివరాలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు తమ కస్టమర్‌ ఐ.డీ  నంబరు ఫీడ్‌ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేయాలి.  60 రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీసినా.. ఏ నెలకు ఆ నెల విద్యుత్‌ వినియోగం మేరకే కరెంటు బిల్లు అందిస్తాం. ఎంత వాడితే అంతే కరెంటు బిల్లు వస్తుందని తెలియచేయనున్నారు. 

బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇచ్చారు.మార్చి నెల వినియోగానికి 2019–20 టారిఫ్‌ కేటగిరీ వర్తింప చేశామని, అలాగే ఏప్రిల్‌ వినియోగానికి 2020–21 నూతన టారిఫ్‌ ప్రకారం బిల్లులు జారీ చేశామని శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. దీని వల్ల ఏప్రిల్‌లో విద్యుత్‌ బిల్లు కొంత మేర తగ్గే అవకాశం వుంది. కోవిడ్ 19 కారణంగా జనమంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. దీంతో కరెంట్ వినియోగం కూడా పెరిగిందని చెప్పాలి. 

ప్రతి 30 రోజులకోసారి తీసే మీటర్‌ రీడింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా 60 రోజులకు అంటే మార్చి, ఏప్రిల్‌ వినియోగం ఆధారంగా తీశారు. ఏప్రిల్‌ 1 నుంచి ఏపీఈఆర్‌సీ ప్రకటించిన కొత్త టారిఫ్‌ అమలులోకి వచ్చింది. దీంతో మార్చిలో 10న రీడింగ్‌ తీయడం వల్ల మిగిలిన 21 రోజులనే లెక్కలోకి తీసుకున్నామని అధికారులు అంటున్నారు. రీడింగ్‌ తీసిన 60 రోజులలో 21 రోజులు మార్చి నెలకు, మిగిలినవి ఏప్రిల్‌లోకి పరిగణనలోకి తీసుకున్నారు.

విద్యుత్ బిల్లులు పెరగలేదని, 75 యూనిట్లలోపు వినియోగం ఉంటే ఏ కేటగిరీలోనే వుంటారు. అలాగే 225 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగం ఉంటే బీ కేటగిరీ.. ఆ తదుపరి వినియోగం ఉన్న వాళ్లే కేటగిరీ సీలోకి వెళ్తారు. 500 యూనిట్లుపైన వినియోగం ఉన్నవాళ్లకు మాత్రం ఈ ఏడాది యూనిట్‌కు 90 పైసలు పెంచింది.  తక్కువ వినియోగం ఉన్న వారికి ఎలాంటి అదనపు భారం పడే అవకాశం లేదని అధికారులు వినియోగదారులకు వివరిస్తున్నారు. ఏటా మార్చి నెలలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఈసారి లాక్‌డౌన్‌ వల్ల ప్రతీ ఒక్కరూ గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగింది. ఫలితంగా యూనిట్లు పెరిగి శ్లాబులూ మారినట్టు అధికారులు చెబుతున్నారు. 

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

   4 hours ago


ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

   5 hours ago


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

   5 hours ago


సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

   6 hours ago


ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

   7 hours ago


కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

   8 hours ago


కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

   8 hours ago


5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

   9 hours ago


గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

   9 hours ago


కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle