newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

విద్యుత్ ధరలు తగ్గించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమా... కేంద్ర సంస్థ ఝలక్

27-09-201927-09-2019 09:28:02 IST
Updated On 27-09-2019 16:25:55 ISTUpdated On 27-09-20192019-09-27T03:58:02.214Z27-09-2019 2019-09-27T03:57:59.602Z - 2019-09-27T10:55:55.388Z - 27-09-2019

విద్యుత్ ధరలు తగ్గించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమా... కేంద్ర సంస్థ ఝలక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవినీతి రహిత, పారదర్శక పాలనను అందిస్తానంటూ గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను తిరగతోడుతూ ముందుకెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణల్లో వరుస ఎదురు దెబ్బలను తింటూ కూడా తన పంథాను మార్చుకోకపోవడంపై ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ప్రబుత్వమైన తన వాదనలో నిజాయితీ, వాస్తవం ఉన్నాయనిపిస్తే కొండను ఢీకొన్నా తప్పులేదు కానీ కేంద్ర స్థాయి సంస్థలు విద్యుత్ రంగ ఒప్పందాలలో చేయి పెట్టవద్దని అధికారుల స్థాయి నుంచి మంత్రుల వరకు మొత్తుకుంటున్నా ఏపీ ప్రభుత్వం వినకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అంతిమంగా ఈ పరిణామాలు ఎలాంటి ఫలితాలనిస్తాయో కానీ ప్రస్తుతానికి మాత్రం వైకాపా ప్రభుత్వం ప్రత్యేకించి విద్యుత్ రంగ ఒప్పందాల రద్దు విషయంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందనే చెప్పాలి.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు పీపీఏలను సమీక్షించాలని పట్టుబడుతూనే అంతకంటే ఎక్కువ ఖరీదైన బొగ్గు ఆధారిత విద్యుత్ పీపీఏల విషయంలో పక్షపాతం చూపుతోందని డిల్లీకి చెందిన ఆర్థిక పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ (సీఎఫ్ఏ) తాజాగా ప్రశ్నించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పునరుత్పాదక ఇంధన వనరుల యూనిట్‌కు కేవలం రూ. 4.54లు మాత్రమే ఖర్చవుతుండగా, ప్రస్తుత ఏడాదిలో ఏపీ ప్రభుత్వం బొగ్గు ఆధారిత (థర్మల్) విద్యుత్‌పై యూనిట్‌కు రూ. 5.75 లు వెచ్చించడంలో మతలబు ఏంటని సీఎఫ్ఏ ఆక్షేపించింది.

ఒకవేళ విద్యుత్ ధరలు తగ్గించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమైతే పర్యావరణానికి హాని చేసే థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటం పూర్తిగా తగ్గించాలని కేంద్ర ఆర్థిక పరిశోధనా సంస్థ సూచించింది. ఉదాహరణకు ఇటీవలే గుజరాత్ ప్రభుత్వం థర్మల్ విద్యుత్‌కు అనుమతులు పూర్తిగా నిలిపివేయగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కడా ఈ దిశగా ఆలోచిస్తోందని సీఎఫ్ఏ తెలిపింది.

ఈ పరిస్థితుల్లో అధిక ధరలతో కూడిన థర్మల్ విద్యుత్‌కు మద్దతు నిస్తూ పునరుత్పాదక విద్యుత్ సంస్థల పీపీఏల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సమంజసం కాదని కేంద్ర ఆర్థిక పరిశోధనా సంస్థ హితవు పలికింది.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ప్రశ్నకు బదులు చెప్పక తప్పదనిపిస్తోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle