విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-202024-07-2020 17:51:52 IST
2020-07-24T12:21:52.655Z24-07-2020 2020-07-24T12:21:49.369Z - - 20-01-2021

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పదో నెంబర్ వరకు అంతా జగన్ అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. ఆ పార్టీ నడిచేది మొత్తం జగన్ ఇష్టం, కష్టంతోనే. అయితే, జగన్ కోర్ టీమ్‌లోని ముగ్గురిలో మాత్రం విజయసాయిరెడ్డి ఒకరు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సాయిరెడ్డి చెప్పిందే వైసీపీలో ఫైనల్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ బాధితులను ఓదార్చేందుకు వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కారు ఎక్కి మళ్లీ దిగిన సంఘటన ఆధారంగా ఇటువంటి వార్తలు మొదలయ్యాయి. అయితే, విజయసాయిరెడ్డి లాంటి జగన్‌కు బాగా ఉపయోగపడుతున్న క్యారెక్టర్‌ను దూరం చేయాలనే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎత్తులు కూడా ఈ ప్రచారం వెనుక ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీలో జగన్ తర్వాత టీడీపీకి, టీడీపీ అనుకూల మీడియాకు విజయసాయి రెడ్డి టార్గెట్‌గా ఉంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన ఓ కీలక రాజకీయ మలుపులో విజయసాయిరెడ్డి ఇష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. నిజానికి ఆయన గత ఎన్నికల ముందే రాష్ట్రంలో వైసీపీ వేవ్ నడుస్తుందని పసిగట్టారు. ఎన్నికల ముందే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని భావించారు. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ముగిశాయి. అయితే, టీడీపీ పెద్దలు బుజ్జగించడం వల్ల చివరకు ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. ప్రజల మనస్సులు గెలుచుకున్నా, గెలుచుకోపోయినా అర్థం చేసుకోవడంలో మాత్రం గంటా శ్రీనివాసరావు దిట్ట. అందుకే ప్రతి ఎన్నికకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలకు మారుతూ గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారి విజయం సాధించారు. కానీ, పార్టీ ఓడిపోవడంతో ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే సైలెంట్‌గా మారిపోయారు. పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. పైగా విశాఖపట్నాన్ని పాలనా రాజధాని చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ స్టాండ్‌కు వ్యతిరేకంగా సమర్థించారు. గత ఏడాది కాలంగా అనేకసార్లు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా వైసీపీ ముఖ్యులతో జరిగాయని సమాచారం. అయితే, గంటా శ్రీనివాస్ చేరికను ఆయన పాత స్నేహితుడు, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంఛార్జి విజయసాయిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. గంటా ఏ పార్టీలో ఉన్నా జిల్లాలో కీ రోల్ పోషిస్తారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత మంత్రి పదవి పొందిన ఆయన, మళ్లీ టీడీపీలోకి వచ్చిన ఐదేళ్లు మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు కూడా టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి గెలిస్తే గంటాకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గంటా లాంటి వారిని తమ పార్టీలో చేర్చుకోమని ముందు జాగ్రత్తగా అవంతి శ్రీనివాస్ పదేపదే మీడియా ముందు చెప్పి గంటా చేరికకు బ్రేకులు వేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తాను వైసీపీలో చేరాలనుకుంటే అవంతి లాంటి వారు అడ్డుకోలేరని గంటా కౌంటర్ ఇవ్వడం ద్వారా వైసీపీలో చేరే ఆలోచన ఏ మూలో ఉందని చెప్పకనే చెప్పారు. వైసీపీలో ఎవరు చేరినా విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తారు. ఆయనే దగ్గరుండి వారిని జగన్ వద్దకు తీసుకెళ్లి కండువా కప్పిస్తారు. కానీ, గంటా చేరికకు మాత్రం ఆయన సానుకూలంగా లేరనే ప్రచారం జరుగుతోంది. అయినా, గంటా మరికొందరు వైసీపీ ముఖ్యుల ద్వారా పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారని చెబుతున్నారు. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో వైసీపీకి అంతగా పట్టులేదు. 2014లో స్వయంగా వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. 2019లోనూ విశాఖ రూరల్‌లో వైసీపీ సత్తా చాటినా నగరంలో మాత్రం నాలుగింటికి నాలు నియోజకవర్గాల్లో ఓడిపోయింది. ఇటువంటి సమయంలో రాజధానిలో తమ పార్టీ బలం పెంచుకోవడం వైసీపీకి రాజకీయంగా అవసరం. ఈ అవసరం రిత్యానే బలమైన నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో విజయసాయిరెడ్డికి నచ్చజెబుతారా, లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి క్వారంటైన్లో ఉన్నప్పుడే గంటా చేరికకు సంబంధించిన ప్రచారం మొదలుకావడం ఇక్కడ గమనార్హం.

పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీలు ఇక చెల్లవ్.. లోక్‌సభ స్పీకర్
19 minutes ago

సహ నిందితురాలికి ప్రమోషన్ ఇచ్చేసిన సీఎం జగన్
36 minutes ago

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
2 hours ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
5 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
3 hours ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
6 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
6 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
7 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
7 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
8 hours ago
ఇంకా